Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్ స్టాపబుల్ టీజర్ లాంచ్ చేసిన నాగార్జున

Advertiesment
butter fly team with anupama
, సోమవారం, 26 డిశెంబరు 2022 (14:47 IST)
పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'.  'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక.  బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

హైదరాబాద్, నిజామాబాద్, గోవాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లతో ముస్తాబవుతోంది. ఇటివలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈరోజు కింగ్ నాగార్జున 'అన్ స్టాపబుల్' టీజర్‌ను విడుదల చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
 
''ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా''అంటూ30 ఇయర్స్ పృథ్వీ  ఓవర్ తో మొదలైన టీజర్ ఆద్యంతం వినోదం పంచింది. సన్నీ, సప్తగిరిలను మోసగాళ్ళయిన బెస్ట్ ఫ్రెండ్స్‌గా పరిచయం చేశారు. ప్రముఖ హాస్యనటులు బిత్తిరి సత్తి, షకలక శంకర్, రఘుబాబు పాత్రలు ఫన్ రైడ్ గా సాగాయి. టీజర్ లో వినిపించిన డైలాగులు అద్భుతంగా పేలాయి. స్క్రీన్‌ప్లే రసవత్తరంగా వుంది. టీజర్ మొత్తం హిలేరియస్ గా వుంది. డైమండ్ రత్నబాబు తన మార్క్ ఎంటర్‌టైనర్‌తో థియేటర్స్ లో నవ్వులు పూయించడానికి వస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో పెద్ద అసెట్.
 
ఈ చిత్రానికి కో ప్రోడ్యుసర్లుగా షేక్ రఫీ, బిట్టు, రాము వురుగొండ వ్యవహరిస్తున్నారు. డీపీపీ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ పని చేస్తున్నారు.   ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగానే పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు రావడం, ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా వుంది. ఇప్పటికే చిత్ర మ్యూజిక్ రైట్స్ పెద్ద సంస్థ తీసుకుంది. మేకర్స్ త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.
 
తారాగణం: విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్, బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృథ్వీ, డిజే టిల్లు మురళి, సూపర్ విమన్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మీ, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్ చక్రపాణ, గబ్బర్ సింగ్ బ్యాచ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు లిప్ లాక్ ఇచ్చిన చందమామ