Webdunia - Bharat's app for daily news and videos

Install App

`కుర్ర‌గాడి చూపుల‌న్ని కొప్పులోన ముడుచుకుంట‌`అంటోన్న సాయిప‌ల్ల‌వి

'విరాట‌ప‌ర్వం'లో "కోలు కోలు" లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌‌‌

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (18:17 IST)
Virataparvam, song
రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నసినిమా 'విరాట‌ప‌ర్వం'. డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న 'విరాట‌ప‌ర్వం'ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
 
గురువారం ఈ చిత్రంలోని "కోలు కోల‌మ్మా కోలో కోలో నా సామి మ‌న‌సే మేలుకొని చూసే.." అంటూ సాగే సాంగ్ లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. 'స్త్రీ' ప్రేమ, అనంతమైన కథనాలను నిశ్శబ్దంగానే ప్రపంచానికి అందిస్తుందనే విష‌యాన్ని ఈ "కోలు కోలు" పాట మ‌న‌కు తెలియ‌జేస్తుంది. త‌ను మ‌న‌సిచ్చిన వాడి గురించి క‌థానాయిక వెన్నెల ఓ క‌థ‌నంలా పాడుకుంటోంది. వెన్నెల‌గా సాయిప‌ల్ల‌వి న‌టించింది.ఇప్ప‌టికే ఎన్నో గొప్ప పాట‌ల‌ను,మంచి పాట‌ల‌ను అందించిన చంద్ర‌బోస్ క‌లం మ‌రోసారి అనంత‌మైన ప్రేమ‌ను కురిపిస్తూ ఈ పాట‌ను అల్లింది.
"పిల్ల‌గాడి మాట‌ల‌న్ని గాజుల‌ల్లె మార్చుకుంట‌.. కాలిధూళి బొట్టు పెట్టుకుంటా...
కుర్ర‌గాడి చూపుల‌న్ని కొప్పులోన ముడుచుకుంట‌.. అల్ల‌రంత న‌ల్ల‌పూస‌లంటా.."
లాంటి లైన్లు రాయ‌గ‌లిగింది ఆయ‌న క‌ల‌మే క‌దా!
సురేష్ బొబ్బిలి సుమ‌ధుర బాణీలు అందిస్తే, దివ్య‌మాలిక త‌న అంతే మ‌ధుర గాత్రంతో ఈ పాట‌కు ప్రాణమిచ్చారు.
 
ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వ‌దినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్ల‌వి జంట పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిజానికి ఇవ‌న్నీ 'విరాట‌ప‌ర్వం'పై అంచ‌నాల‌ను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిప‌ల్ల‌వి జోడీ చూడ‌చ‌క్క‌గా ఉంద‌ని అన్ని వ‌ర్గాల నుంచీ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.
 
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments