Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండ్‌కు త‌గిన‌ట్లు తీసిన పెళ్లి సందD కి ఆద‌ర‌ణః కె.రాఘ‌వేంద్ర‌రావు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (18:04 IST)
Pelli SandaD successmeet
కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’ ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా  సినిమాను అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేశారు. శ‌నివారం ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.
 
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, పాతికేళ్ల ముందు తీసిన పెళ్లి సంద‌డి సినిమాను ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు మార్చి తీసిన డైరెక్ట‌ర్ గౌరి రోణంకికి థాంక్స్‌. ఈ సినిమాను ఇంత బాగా ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు నా 110 సినిమాల న‌మ‌స్కారాలు. గౌరి నా ద‌గ్గ‌ర ప‌దేళ్లుగా ప‌నిచేస్తుంది. త‌ను సినిమాను తెరెక్కించిన విధానం నాకెంతో న‌చ్చింది. అలాగే హీరో రోష‌న్‌, హీరోయిన్ శ్రీలీల‌కు థాంక్స్‌. నేను ఎంతో స్టార్ హీరోల‌ను, హీరోయిన్స్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాను. ఇప్పుడు అదే న‌మ్మ‌కంతో రోష‌న్‌ను కూడా నాకు అప్ప‌గించారు. త‌ను అంతే చ‌క్క‌గా న‌టించాడు. శ్రీలీల అందంగా న‌టించింది. త‌ను డాక్ట‌ర్ చదువుతుంది. హాకీలో స్టేట్ ప్లేయ‌ర్‌, స్విమ్మింగ్‌లో నెంబ‌ర్ వ‌న్‌. ఆరు భాష‌ల‌ను మాట్లాడే అమ్మాయి త‌ను. ఎలా న‌టిస్తుందా? అనిపించేది. అయితే రిహార్స‌ల్‌లోనే న‌టిగా త‌నేంటో ప్రూవ్ చేసుకుంది. కీర‌వాణి, చంద్ర‌బోస్ కాంబినేష‌న్లో చేసిన పాట‌లు ప్రేక్ష‌కుల‌కు అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి. పాట‌ల‌కు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి ప్రేక్ష‌కుల ఈలలు వేస్తున్నారు. కుటుంబ క‌థా చిత్రాల‌ను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫోన్స్ చేసి చెబుతున్నారు. ఈ సంద‌ర్భంలో థియేట‌ర్స్‌కు వంద శాతం ఆక్యుపెన్సీకి ప‌ర్మిష‌న్ ఇచ్చిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌గారికి, ఆయ‌న ప్ర‌భుత్వానికి థాంక్స్‌’’ అన్నారు. .
 
ర‌చ‌యిత‌ శ్రీధ‌ర్ సీపాన మాట్లాడుతూ, ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి నేను, డైరెక్ట‌ర్ గౌరి రోణంకిగారు శ్రీకాంత్‌గారి ద‌గ్గ‌ర‌కు వెళితే ‘త‌మ్ముడు ఈ సినిమా హిట్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను’ అన్నారు. అలాగే రాత్రి పదకొండు గంటలకు శ్రీకాంత్ గారు ఫోన్ చేసి ‘అన్ని ఏరియాల‌కు ఫోన్ చేసిన రిజ‌ల్ట్ గురించి తెలుసుకున్న త‌ర్వాతే నీకు ఫోన్ చేస్తున్నాను. నీకు గిఫ్ట్ పంపిస్తున్నాను’ అన్నారు. కరోనా తర్వాత పండగ తర్వాత ఫ్యామిలీస్ సినిమా థియేటర్స్‌కు వెళ్లి పండ‌గ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో రాఘ‌వేంద్ర‌రావుగారు రోష‌న్ రూపంలో మ‌రో సూప‌ర్‌స్టార్‌ను ప‌రిచ‌యం చేశారు’’ అన్నారు. 
 
ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ, రాఘ‌వేంద్ర‌రావుగారు మంచి అవ‌కాశం ఇచ్చారు. గ్రాండ్ ఓపెనింగ్ ద‌క్కింది. అలాగే కీర‌వాణి స‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. హీరో రోష‌న్‌, హీరోయిన్ శ్రీలీల క్యూట్‌గా ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అంద‌రి ఆశీర్వాదాలు ఉండాల‌ని కోరుకుంటున్నాను. మా సినిమాలో వ‌శిష్ట‌గా రాఘ‌వేంద్ర‌రావుగారు, మా గురువుగారు అద్భుతంగా న‌టించారు. రాఘ‌వేంద్ర‌రావుగారి ముందు డైరెక్ట్ చేయ‌డం పెద్ద టాస్క్‌. న‌టుడిగా ఎంతో ఎన‌ర్జిటిక్‌గా న‌టించారని తెలిపారు. 
 
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, హిట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆడియెన్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. కీర‌వాణిగారు ఎక్స్‌ట్రార్డిన‌రీ సంగీతాన్నిచ్చారు. చాలా మంచి బేస్ వ‌చ్చింద‌ని భావిస్తున్నాను. మా ‘పెళ్లి సందD’పై ప్రేమ‌ను చూపిస్తున్న‌ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు. 
 
హీరో రోషన్ మాట్లాడుతూ ‘‘సినిమాను చూసి ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఆంధ్రాలో అయితే రెండు రోజులు హండ్రెడ్ ప‌ర్సెంట్ ఆక్యుపెన్సీతో ర‌న్ అవుతుంది. లీల కూడా ఎన‌ర్జిటిక్‌గా న‌టించింది. ఫైట్స్‌, డాన్సులు బావున్నాయ‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. సెట్స్‌కు వెళ్ల‌డానికి ముందే శేఖ‌ర్ మాస్ట‌ర్ బాగా టైనింగ్ ఇవ్వ‌డంతో ఆ అవుట్‌పుట్ తెర‌పై క‌నిపిస్తుంది. కీర‌వాణిగారిమ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంద‌ని అంటున్నారు. కుటుంబం అంతా క‌లిసి సినిమాకు వ‌స్తున్నార‌ని తెలిసి ఆనందంగా ఉంది’’ అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments