Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తా : రాహుల్ గాంధీ

Advertiesment
Rahul Gandhi
, శనివారం, 16 అక్టోబరు 2021 (17:47 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి రావాలన్న ఆకాంక్ష శనివారం జరిగి సీడబ్ల్యూసీ సమావేశంలో బలంగా వినిపించింది. ఏఐసీసీ సీనియర్ నాయకులు సైతం రాహుల్ నాయకత్వానికి మద్దతు పలికారు. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు సానుకూలంగా స్పందించారు. 
 
దీనిపై రాహుల్ స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను మరోసారి చేపట్టే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే పార్టీ సైద్ధాంతిక భావజాలంపై సీనియర్ల నుంచి స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
 
కాగా, పలువురు నేతలు స్పందిస్తూ, ఎన్నికల వరకు రాహుల్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని సూచించారు. అటు, పార్టీకి తానే పూర్తిస్థాయి అధినేత్రినని, తాత్కాలిక అధ్యక్షురాలిగా చూడొద్దని సోనియా గాంధీ స్పష్టం చేయడం తెలిసిందే.
 
ఇక, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 2022 ఏప్రిల్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నిక జరగనుంది. 2022 అక్టోబరు 31 నాటికి పార్టీకి కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
 
అంతకుముందు సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన‌ కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశంలో స‌భ్యులంద‌రూ రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాల‌నే ప్ర‌తిపాద‌న‌కు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. 
 
నేత‌లంతా రాహుల్ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ప‌లికార‌ని సీడ‌బ్ల్యూసీ స‌మావేశం అనంత‌రం పార్టీ నేత అంబికా సోని విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవ్వాలని కాంగ్రెస్ నాయకులందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని అంబికా సోనీ తెలిపారు. 
 
2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు.ఎన్నిక‌ల వ‌రకూ రాహుల్‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మించాల‌ని మ‌రి కొంద‌రు నేత‌లు సూచించారు. పార్టీ ప‌గ్గాల‌ను చేప‌ట్టాలా లేదా అని తేల్చుకోవాల్సింది రాహుల్ గాంధీయేన‌ని అంబికా సోని పేర్కొన్నారు. 
 
దేశ రాజ‌కీయ ప‌రిస్ధితులు, ధ‌ర‌ల మంట‌, వ్య‌వ‌సాయ సంక్షోభం, రైతుల‌పై దాడుల వంటి అంశాల‌పై మూడు తీర్మానాల‌ను ఆమోదించామ‌ని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సీడబ్ల్యూసీ భేటీ అనంత‌రం వెల్ల‌డించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం - ఆరెంజ్ అలెర్ట్