Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేదిః బొమ్మరిల్లు భాస్కర్

Advertiesment
అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేదిః బొమ్మరిల్లు భాస్కర్
, శనివారం, 16 అక్టోబరు 2021 (17:42 IST)
director Bhaskar
"బొమ్మరిల్లు'' నుండి సాగుతున్న ఈ ప్ర‌యాణంలో నా జీవితాన్ని గ‌మ‌నిస్తూ నేను ఎక్కడో ఫీల్ అయిన విషయాలను కథగా రాసుకొని స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలన్నదే నా ప్రయత్నం. నా ప్రతి సినిమాలో అది చేసుకుంటూ వచ్చాను. ప్రతి సినిమాను నేను అనలైజ్ చేసుకుంటూ కథగా రాసేటప్పుడు నా లైఫ్ లో నేను చేసిన తప్పుల్ని తెలుసుకుంటూ  నా లైఫ్ తో పాటు అందరి లైఫ్స్  బెటర్ మెంట్స్ ఆవ్వాలని కొత్త,కొత్త థాట్స్ తో  కథను తయారు చేసుకొంటూ వచ్చాను. లైఫ్ లో అందరూ హ్యాపీగా ఇంటెన్స్ గా బతకాలి అనేదే నా కోరిక` అని ద‌ర్శ‌కుడు భాస్కర్ తెలియ‌జేస్తున్నారు.
 
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే  కాంబినేష‌న్‌లో తీసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ద‌స‌రానాడు విడుదలై అన్ని ఏరియాల నుండి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈసంద‌ర్భంగా బొమ్మరిల్లు భాస్కర్ తో ఇంటర్వ్యూ.
 
- "బొమ్మరిల్లు" సినిమాలో ఫాదర్ & సన్ ఎమోషన్ చూపించారు.మీ ఫాదర్ అలాగే వుండే వారా అని అడిగే వారు కానీ  మా ఫాదర్ స్కూల్ హెడ్మాస్టర్ ఆయన చాలా ఫ్రీడం ఇచ్చే మనిషి. 
 
- నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఎక్కువగా పెరిగాను.అక్కడ జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను బొమ్మరిల్లు సినిమాలో తీసుకోవడం జరిగింది.అలాగే నా లైఫ్ స్టైల్ లో జరిగినవి. ఆఫీసుకెళ్ళి పని చెయ్యమని చెప్పినపుడు జరినవి కావచ్చు. స్పెషల్ గా నేను వారి ఇంట్లో క్యారం బోర్డు ఆడే టప్పుడు  స్ట్రైకర్ నా చేతిలో ఉన్నప్పుడు నాకు ఎలా కొట్టాలో  తెలుసు.కానీ నా  స్ట్రైకర్ దగ్గర వేరే వ్యక్తి చెయ్యిపెట్టి ఇలా ఆడు,ఆలా ఆడకు అని  చెపితే నాకు నచ్చేదికాదు.వారి ప్రేమ నాకు అర్థమైన కానీ మనకు ఫ్రీడమ్ ఒకటి ఉంటుంది కదా మనకు నచ్చింది చేయాలనేది నా కోరిక. 
 
- ఈ పదిహేను సంవత్సరాల్లో నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసుకుంటూ వచ్చాను. ఇన్ని తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ఆలోచించదానికే నాకు ఎక్కువ టైం పట్టేది. `ఒంగోలు గిత్త` తర్వాత రాజుగారు, పి.వి.పి గార్లతో బెంగళూర్ లో  తమిళ్, తెలుగు లో మల్టిస్టారర్స్ సినిమా స్టార్ట్ చేదామని కున్నాం. నా ఇంటి చుట్టూ ప‌క్క‌ల అంతా మా క‌జిన్స్ వుంటారు. అందుకే అక్క‌డ చూసిన‌ చిన్న ఎలిమెంట్ న‌చ్చింది రెడీ చేసుకున్నాను. అయితే ఇందులో రెండు భాషల్లోనూ ముగ్గురు పెద్ద హీరోలు, నలుగురు పెద్ద హీరోయిన్స్ ఇంత పెద్ద కాస్టింగ్ తో  అనుకున్నప్పుడు వారి డేట్స్ కుదరక క్యాస్టింగ్ కోసమే సంవత్సరం పైనే టైం అయ్యింది. దాంతో ప్రొడ్యూసర్ కు చాలా టైం వెస్ట్ అవుతుందని తమిళ్ లో సినిమా చేయడం జరిగింది.
 
- నాకు సినిమా, సినిమాకు గ్యాప్ వస్తుందని, వెనకబడి పోతున్నానని టెన్షన్ నేను ఎప్పుడు తీసుకోను నేను తీసే సినిమాల్లో మనము ప్రేక్షకులకు ఏం చెబుతున్నాం అనేదే నా ఇంటెన్సెన్. నేను చేసిన ప్రతి సినిమాకూడా సక్సెస్ అయితే హ్యాపీనెస్ ఇస్తుంది. నేను నా ప్రొడ్యూసర్స్ అందరి మొఖాల్లోనూ చిరు నవ్వు చూసినప్పుడే సక్సెస్ గా ఫీల్ అవుతాను.అలాగే నా చుట్టూ ఉన్న వారందరిలో స్మైలింగ్ ఫేస్ చూసేనప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. 
 
- "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" తీసుకుంటే మ్యారేజ్ అన్న దాంట్లో మనకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి, పెళ్లి అనేది ఫుల్ హ్యాపీ గా జరిగినా కూడా.. ప్రతి పెళ్లి లో ఫుల్ సెలబ్రేషన్స్ కనిపిస్తాయి తర్వాత వచ్చే దాంట్లో ఎలా బ్రతకాలో అనే క్లారిటీ ఉండదు. దీంట్లో ఉన్న డైనమిక్ ఏంటో అనేది మనకు తెలియదు. దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో చెప్పాలి కాబట్టి నాకున్న లిమిటేషన్స్ తో, నాకున్న ఫ్రీడం లో ఫన్నీ లేయర్ తో చెప్పాలి కాబట్టి  ఈ సినిమాను లైట్ హార్టెడ్ గా ఎంజాయ్ చేయాలని తీశాము.
 
- ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైన జంటను లైఫ్ లాంగ్ హ్యాపీగా పక్కన ఉండాలని చెపుతారు. కానీ లైఫ్ లాంగ్ పక్కన ఉండడం వేరు దగ్గర ఉండడం వేరు. పక్కన ఉండడానికి అన్ని అర్హతలు సంపాదిస్తాం కానీ దగ్గర ఉండడానికి ఎం కావాలి అన్నది ఇందులో చూపించాము. మనం పిల్లలకి చిన్నప్పటి నుండి ఎమోషన్స్ అర్థం అయ్యేలా  నేర్పించి ఉంటే అది వస్తువులతో కానివ్వండి, మనసులతో కానివ్వండి ఇంకో లెవెల్లో మన లైఫ్ బెటర్ గా ఉండేది. లైఫ్ అంతా కూడా ఎమోషనల్ మీదే ఆధారపడి ఉంటుంది. కడుపు ఆకలి ఎంత ఇంపార్టెంట్ అంతకంటే ఇంపార్టెంట్ మానసిక అవసరాలను తీర్చుకోవడం. అందుకే క్లైమాక్స్ లో హీరోయిన్ అంటుంది, ఎమోషనల్ అవసరాలను తీర్చుకోవడానికి, షేర్ చేసుకోవడానికి మాకంటూ ఒకడు ఉండాలి అందుకే పెళ్లి చేస్తారేమో అనే డైలాగ్ ఇందులో ఉంది. 
 
- మనలో ఉన్న ఒక్క ఎమోషన్ ని ఒకరికి చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పాలనుకున్న టైంలో వారు రాకపోతే మనం పడే బాధని వర్ణించలేము. ఆ బాధ ఎలా ఉంటుందనేది ఇందులో చూపించాము.
 
- నాకు టెక్నికల్ గా రైటర్ గా బొమ్మరిల్లు నాకు శక్తి నిచ్చింది. సురేష్ గారు ఫిలిం స్కూల్ కి వెళ్లేటప్పుడు బొమ్మరిల్లు లాంటి స్క్రీన్ ప్లే  రాయాలని స్టూడెంట్స్ కు చెపుతున్నాను అనేవారు. అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. నేను కూడా ఫిల్మ్ ఇన్స్ ట్యూట్ లో నేర్చుకుని వచ్చినవాన్నే ఎడిటర్ మోహన్ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. 
 
- మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం.గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.నేను నా సినిమాలో  మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను నాకు సిచ్చువేషన్ కరెక్ట్ గా ఉన్న సాంగ్స్ ను సెలెక్ట్ చేసుకొంటాను చూసిన ఐదు నిమిషాలు కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యాలని చూస్తాను. 
 
- ఈ సినిమా చూసిన యూత్ అందరూ కూడా ఫోన్స్ చేసి చాలా బాగా తీసావ్, కపుల్స్ కూడా వారిలో ఎం లోపం ఉందని ఆలోచించుకొనే టాపిక్ చెప్పావు అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది.ఈ సినిమా ఇంత బాగా రావడానికి  అరవింద్ గారు, వాసు వర్మ ,బన్ని వాసు గారు నిజంగా హెల్ప్ చేశారు. చిన్న లైను ఎమోషన్ గా చెప్పడం నాకిష్టం, డ్రైగా చెప్పడం ఇష్టం ఉండదు .అలా ట్రై చేసి నందుకు  అందరూ బెస్ట్ కాంప్లిమెంట్  ఇస్తున్నారు. 
 
- కొత్త సినిమాల‌కు కొన్ని కథలు ఉన్నాయి అవి ఏంటి ఎవరితో చేస్తాను అనే విషయాలు త్వరలో తెలియ జేస్తాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ అన్నాత్తె తెలుగులో పెద్ద‌న్న‌గా రాబోతోంది