Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (10:29 IST)
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్ (68) కన్నుమూశారు. ఈ నెల 28న సాయంత్రం హైద‌రాబాద్‌లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు.
 
పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది.
 
పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్ఎస్-100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలలో నటించి పాపుల‌ర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వెంకటలచ్చిమి" అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
విషాదం నుంచి పాయల్ రాజ్‌పుత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రముఖులు, సినీ పరిశ్రమలోని పలువురు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళతో భర్త, పట్టేసిన భార్య

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

దేవాన్ష్ పేటీఎంకు హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి.. ఒక్క రోజు లీవు తీసుకున్నాను

Google: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త ఏమిటంటే..?

Special Drive: తిరుపతిలో శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments