Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ స్టోరీకి పాయల్ కరెక్ట్, ఆ పాత్రకు హెబ్బా పటేల్ న్యాయం చేసింది :అలా నిన్ను చేరి నిర్మాత

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (17:23 IST)
Ala Ninnu Cheri team
హీరో దినేష్ తేజ్, అందాల తారలు హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. ఈ సినిమాతో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్లు ప్రయత్నిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్న క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్,మోషన్ పోస్టర్, గ్లింప్స్‌, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్‌‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.   కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అలా నిన్ను చేరి సినిమా ట్రైలర్‌ను యూనిట్ విడుదల చేసింది.

‘ఈ భూమ్మిద పుట్టిన ప్రతీ మనిషికి ఎదిగేందుకు ఓ కల ఉంటుంది.. నాకూ ఓ కల ఉంది’ అనే డైలాగ్‌తో హీరో ఇంట్రడక్షన్‌ ఇస్తూ మొదలైన టీజర్‌లో..   ‘దూరంగా ఉంటున్నావో.. దూరం అవుతున్నావో.. దూరం చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు’.. అంటూ హీరోయిన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ బాగుంది.  ‘అవసరం లేని చోట యుద్దాలు చేయను.. అవసరం అనిపిస్తే కురుక్షేత్ర యుద్దానికి కూడా వెనుకాడను’ అంటూ హీరో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో పాటు ట్రైలర్ చివర్లో.. ‘నీ ఆశయం గొప్పదైతే.. నువ్వు చేసే ప్రయత్నం అంతకంటే గొప్పగా ఉండాలి’.. అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.

 *ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ..* ‘ఇలాంటి చిన్న సినిమాలను ఆడియెన్స్ ఎంకరేజ్ చేయాలి.. నిర్మాత సాయి రాజకీయ రంగం నుంచి ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చారు. హుషారు సినిమాకు దర్శకుడు మారేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అప్పుడే నాకు ఈ కథను చెప్పాడు. దినేష్ నటన చాలా బాగుంది. అన్ని అంశాలతో తెరకెక్కించిన కమర్షియల్ చిత్రమిది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

 *త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ..* ‘మారేష్ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమాను తీశారు . హెబ్బా, పాయల్ అద్భుతంగా చేశారు. లక్కీ మీడియాకు దినేష్ వచ్చినప్పుడే అతను నాకు తెలుసు. ఈ సినిమా రిలీజ్ కాబోతోందని యూనిట్‌లో కనిపిస్తున్న ఆనందం కోసం మేం ఇలా గెస్టులుగా వస్తాం’ అని అన్నారు.

 *డైరెక్టర్ మారేష్ శివన్ మాట్లాడుతూ..* ‘సినిమా బాగా తీశాను. ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. నేను ఇలా ఇక్కడ ఉండేందుకు కారణం మా నిర్మాత సాయి. సినిమాలోని ఎమోషన్, కథ నచ్చి కొమ్మాలపాటి శ్రీధర్ గారు నిర్మించారు. దినేష్ నాకు ఎంతో సహకరించారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఓ రెండు గంటల పాటు అదే ట్రాన్స్‌లో ఉంటారు. చిన్న సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన బెక్కెం వేణుగోపాల్ గారు, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్.  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. నా బెస్ట్ ఇచ్చాను. ప్రేక్షకులు మా సినిమాను, టీంను ప్రోత్సహించండి’ అని అన్నారు.

 *నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ..* ‘ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా. మంచి చిత్రాన్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. లవ్ స్టోరీలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమాకు దినేష్ రైట్ చాయిస్ అనిపించింది. క్యూట్ లవ్ స్టోరీకి క్యూట్ హీరోయిన్ పాయల్ కరెక్ట్ అనిపించింది. అండర్ కరెంట్‌గా ఓ మెసెజ్ ఉంటుంది. ఆ పాత్రకు హెబ్బా పటేల్ న్యాయం చేసింది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా సినిమాను తీశాం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

 *దినేష్ తేజ్ మాట్లాడుతూ..* ‘గెస్టులుగా వచ్చిన హరి ప్రసాద్ గారు, బెక్కెం వేణుగోపాల్ గారు, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. మా టీం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను. ఆకలి మీదున్న వారికి మంచి ఫుల్ మీల్స్ పెడితే ఎలా ఉంటుందో మా సినిమా కూడా అలానే ఉంటుంది.  మా ఈ సినిమా అందరికీ ఓ మంచి జ్ఞాపకంగా ఉంటుంది. త్వరలోనే థియేటర్లోకి మా సినిమా రాబోతోంది. చూసి ఆదరించండి’ అని కోరారు.

 *హరి ప్రసాద్ మాట్లాడుతూ..* ‘ఈ సినిమాను ఎంతో ఫాస్ట్‌గా, అందంగా తీశారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

 *ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ..* ‘సుభాష్ మాకు హుషారు, 18 పేజీస్ వంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలోని పాటలు అందరికీ నచ్చాయి. ట్రైలర్ కూడా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

 *మ్యూజిక్ డైరెక్టర్ సుభాస్ ఆనంద్ మాట్లాడుతూ..* ‘విజన్ మూవీస్ మాకు హోం బ్యానర్. మంచి ఫీల్ గుడ్ మూవీని దర్శకుడు తీశారు. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. నాకు ఫస్ట్ సినిమా అయినా కూడా చంద్రబోస్ గారు ఎంతో సహకరించారు’ అని అన్నారు.

 *హిరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ..* ‘మా నిర్మాతకు, నాకు ఇది మొదటి చిత్రం. తరగతి గది దాటి అనే వెబ్ సిరీస్‌ను చేశాను. ఇదే నా ఫస్ట్ సినిమా. నా లైన్ క్రాస్ చేసి కాస్త బోల్డ్‌గా నటించాను. దినేష్ నాకు సీనియర్. కానీ ఎంతో కంఫర్టబుల్‌గా కలిసి సినిమా చేశాం. మా సినిమాను అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.


<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments