Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయ‌కుడిగా మ‌రోసారి మురిపించ‌నున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (13:48 IST)
Pawan kalyan
క‌థానాయ‌కులు గాయ‌కులుగా మార‌డం తెలిసిందే. త‌మ సినిమాల‌లో ప్ర‌త్యేకంగా ఓ పాట‌ను పాడి అభిమానుల‌ను అల‌రిస్తుంటారు. న‌ట‌న‌తోపాటు ఏదైనా ప్ర‌త్యేకంగా వుండాల‌ని సంగీత ద‌ర్శ‌కులు కోరుకుంటారు. ఆ సంద‌ర్భంలో ఏదోచోట పాట‌ను చొప్పించి సంద‌ర్భానుసారంగా పాడించేస్తారు. గ‌బ్బ‌ర్ సింగ్‌లో కోట శ్రీ‌నివాస‌రావు పాట కూడా అటువంటిదే. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమాల‌కు కొన్ని పాట‌లు పాడారు. త‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `జానీ` సినిమాలో `ఎం.ఎస్‌. నారాయ‌ణ తాగుబోతుగా తాగందే వుండ‌లేడ‌నే సంద‌ర్భంలో సారా తాగ‌డం మానురోయ్ లేదంటే స‌చ్చి ఊరుకుంటావురోయ్‌` అంటూ త‌న‌దైన శైలిలో పాడి మెప్పించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. 
 
ఆ త‌ర్వాత `అత్తారింటికిదారేది` సినిమాలోనూ `కాట‌మ‌రాయుడా.. క‌దిరి న‌ర‌సింహుడా..` అంటూ హైపీచ్‌లో పాడి ఎంట‌ర్‌టైన్ చేశాడు. ఇప్పుడు కొత్త‌గా ఆయ‌న చేబోతున్న `అయ్య‌ప్ప‌న్ కోషియ‌మ్‌` రీమేక్‌లో నూ ఓ పాట‌ను పాడ‌నున్నాడు. ఇది జాన‌ప‌ద‌శైలిలో అంద‌రినీ ఆక‌ట్టుకునేలా జాన‌ప‌ద గీతాన్ని తీసుకుని అదే త‌ర‌హాలో పాడబోతున్నాడు. ఇందుకు సంబంధించిన జాన‌ప‌ద గాయ‌కుల‌ను అనుక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ గాయ‌కుల‌ను థ‌మ‌న్ స్టూడియోకు పిలిపించుకుని మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు ఇదో కొత్త ప్ర‌యోగం అని చెబుతున్నాడు. ఈ సినిమాలో రానా కూడా న‌టిస్తున్నాడు. మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమా కొద్ది భాగం ఆమ‌ధ్య షూటింగ్ కూడా చేశారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments