Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్... కటకటాల్లో బాలీవుడ్ నటి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (12:15 IST)
ఓ బాలీవుడ్ నటి చిక్కుల్లో పడింది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఓ నక్షత్ర హోటల్‌లో ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ వాడారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటి నేహాల్‌ షా తన బర్త్‌ డే సందర్భంగా నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ వేడుకకు గోవాకు చెందిన తన స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ కూడా హాజరయ్యాడు. 
 
ఈ పార్టీలో పాల్గొన్న వారిలో కొందరు మాదకద్రవ్యాలు సేవించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. రైడ్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ బెయిల్ లభించిందని తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంపై విచారణ జరుపుతున్నారు. అలాగే వీరికి మాదకద్రవ్యాల్ని సరఫరా చేసిన వారికి కోసం గాలిస్తున్నారు. నేహాల్‌ షా పలు బాలీవుడ్‌ చిత్రలతో పాటు రెండు తెలుగు చిత్రాల్లోనూ నటించింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 రోజుల్లో రూ.30 కోట్లు- యోగి నోట పింటూ సక్సెస్ స్టోరీ.. ప్రధానిని కలుస్తాడట! (video)

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments