Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జనసేనాధిపతి" ముఖ్యఅతిథిగా నా పేరు సూర్య సక్సెస్ మీట్...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకెళుతోంది. దీంతో ఈ మూవీ సకెస్స్ సంబరాల్ని భారీగ

Webdunia
బుధవారం, 9 మే 2018 (10:46 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకెళుతోంది. దీంతో ఈ మూవీ సకెస్స్ సంబరాల్ని భారీగా చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌కి చీఫ్ గెస్ట్‌గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ ఒకే వేదికపైకి వస్తుండటంతో ఫంక్షన్‌ను భారీస్థాయిలో చేయనున్నారు. మే 10వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరుగుతాయి.
 
ఇదే అంశంపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ, "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" మనందరం గర్వపడే సినిమా. చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఉప్పొంగిపోయే మూవీ. మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ ఈ సినిమాను ప్రధాన బలం. వక్కంతం వంశీ దర్శకుడిగా తన స్టామినా చూపించి సక్సెస్ సాధించాడు. ప్రేక్షకులంతా ముక్తకంఠంతో భారీ కలెక్షన్స్ దిశగా తీసుకెళ్తున్నారు. అందుకే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేశాం. బన్నీ అంటే అమితంగా ఇష్టపడే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌కి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ ఒకే వేదిక మీదకు వస్తే అభిమానుల్లో ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాం" అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments