Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతతో ఆ సినిమా చేస్తానంటున్న దర్శకేంద్రుడు.. చై ఒప్పుకుంటాడా..?

పెళ్ళయిన తరువాత పరిమిత పాత్రల్లో నటిస్తూ ఎక్కడా అశ్లీలంగా కనిపించకుండా జాగ్రత్త పడుతోంది నటి సమంత. అక్కినేని కుటుంబంలో ఒకరు కావడంతో ఎక్కడా కూడా అక్కినేని కుటుంబం పరువు పోగొట్టకుండా జాగ్రత్తపడుతోంది.

Webdunia
బుధవారం, 9 మే 2018 (09:58 IST)
పెళ్ళయిన తరువాత పరిమిత పాత్రల్లో నటిస్తూ ఎక్కడా అశ్లీలంగా కనిపించకుండా జాగ్రత్త పడుతోంది నటి సమంత. అక్కినేని కుటుంబంలో ఒకరు కావడంతో ఎక్కడా కూడా అక్కినేని కుటుంబం పరువు పోగొట్టకుండా జాగ్రత్తపడుతోంది. నాగ చైతన్య చేతిలో సినిమాలు పెద్దగా లేకపోయినా సమంతకు మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్‌గానే కాకుండా గెస్ట్‌రోల్స్ కూడా ఆమెకు చాలానే వస్తున్నాయి. దీంతో సమంత ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కానీ తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమంతతో రొమాంటిక్ లవ్ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.
 
దర్శకేంద్రుడు తన ఆలోచనలను సమంతకు కూడా చెప్పారట. రొమాంటిక్ లవ్ సినిమా అంటే మొత్తం ప్రేమకథా చిత్రమే కాదు. రొమాన్స్ సీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయట. దీంతో అలాంటి సినిమా చేయనని రాఘవేంద్రరావుకు తెగేసి చెప్పేసిందట సమంత. మీకు నా పరిస్థితి తెలుసు సర్. ఎందుకిలా అడుగుతున్నారు. నాకు వివాహం జరిగింది. 
 
గతంలో నేనెప్పుడూ రొమాంటిక్ సినిమాలలో చేయలేదు. మీకు ఆ విషయం తెలుసు. ప్రేమ కథా చిత్రమంటారా. అది కావాలంటే చేస్తానంటోందట సమంత. తాను సిద్ధం చేసుకున్న కథకు రొమాన్స్ కలిస్తేనే బాగుటుంది. క్యూట్ లుక్‌తో అదిరిపోయే హావభావాలతో ప్రస్తుతం నటించగలిగే హీరోయిన్లలో నువ్వొక్కటే నాకు బాగా నచ్చావంటూ దర్శకేంద్రుడు చెప్పారట. అయితే తన భర్త, మామల పర్మిషన్ తీసుకొని చేస్తానంటోందట సమంత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments