Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో.. ఫోన్ తాకాలంటేనే భయమేస్తోంది.. ఇంటర్నెట్‌తో ఇన్ని సమస్యలా?

దక్షిణాది అగ్రనటి సమంత నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. సమంత జర్నలిస్టుగా నటించిన 'మహానటి' బుధవారం నాడు తెలుగులోను, శుక్రవారం నాడు తమిళంలోను విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే విశాల్‌తో క

Advertiesment
వామ్మో.. ఫోన్ తాకాలంటేనే భయమేస్తోంది.. ఇంటర్నెట్‌తో ఇన్ని సమస్యలా?
, సోమవారం, 7 మే 2018 (11:29 IST)
దక్షిణాది అగ్రనటి సమంత నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. సమంత జర్నలిస్టుగా నటించిన 'మహానటి' బుధవారం నాడు తెలుగులోను, శుక్రవారం నాడు తమిళంలోను విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే విశాల్‌తో కలసి సమంత నటించిన ఇరుంబుతిరై కూడా విడుదలకు సిద్ధంగా వుంది.
 
తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ఫోన్ తాకాలంటేనే భయమేస్తుందని చెప్పింది. అంతేగాకుండా ఇరుంబుతిరై కథను వింటే.. విడుదలయ్యాక ఆ సినిమాను ప్రేక్షకులు తిలకించారంటే.. ఇంటర్నెట్ ద్వారా వచ్చే సమస్యలేంటో తెలుసుకుంటారని తెలిపింది. ఇరుంబుతిరై సినిమాలో ఇంటర్నెట్ ద్వారా వచ్చే సమస్యలపై చర్చిస్తుందని వెల్లడించింది. 
 
అలాగే ఈ సినిమా కథను దర్శకుడు మిత్రన్ చెప్పినప్పుడు మీడియా, నెట్ ద్వారా ఇన్ని సమస్యలుంటాయా అని అనిపించిందని తెలిపింది. ఇంకా కథ విన్నాక తన ఫోన్‌ను తాకాలంటేనే భయం వేసిందని తెలిపింది. ఈ సినిమా తరహా సమస్యలు తన జీవితంలో ఎన్నడూ రాలేదని.. అందుకే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని చెప్పింది. 
 
తన స్నేహితులు కొందరికి ఇలాంటి సమస్యలెదురయ్యాయని.. సోషల్ మీడియాను సక్రమమైన రీతిలో ఉపయోగించుకోవాలనే సందేశాన్ని అభిమన్యుడు సినిమా ఇస్తుందని సమంత చెప్పింది. ఈ సినిమాను మిత్రన్ అద్భుతంగా తెరకెక్కించాడని సమంత కొనియాడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తి సురేష్‌ని అచ్చం సావిత్రిలాగే మలిచిన దర్శకుడు...