Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ప్రేక్షక దేవుళ్లకు సమంత ఫన్ టాస్క్.. విజేతలకు బెస్ట్ గిఫ్ట్ (వీడియో)

అక్కినేని ఇంటి కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత సినీ ప్రేక్షక దేవుళ్లకు ఓ పరీక్ష పెట్టారు. ఈ టెస్టులో పాల్గొని విజయం సాధించే వారికి ఆమె బెస్ట్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేయనున్నారు. ఇందుకుసంబంధించి ఆమె తాజాగా

Advertiesment
సినీ ప్రేక్షక దేవుళ్లకు సమంత ఫన్ టాస్క్.. విజేతలకు బెస్ట్ గిఫ్ట్ (వీడియో)
, ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (13:17 IST)
అక్కినేని ఇంటి కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత సినీ ప్రేక్షక దేవుళ్లకు ఓ పరీక్ష పెట్టారు. ఈ టెస్టులో పాల్గొని విజయం సాధించే వారికి ఆమె బెస్ట్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేయనున్నారు. ఇందుకుసంబంధించి ఆమె తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిద్ధాం.
 
ఎరుపు రంగు దుస్తుల్లో ధరించిన సమంత.. ఖుషీ ఖుషీగా తన మొబైల్‌లో అలనాటి నటి సావిత్రి గారి 'అహ నా పెళ్ళంట.. ఓహో నా పెళ్ళంట' పాట వీడియోను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ఈ వీడియో ద్వారా అభిమానులకు ఓ కాంటెస్ట్ కూడా పెట్టింది సమంత. 'అబ్బో ఇది చాలా కష్టం.. సావిత్రి గారిని ఉరికెనే మహానటి అంటారా? ఇది అహా నా పెళ్లి అంట వీడియో. మీరు కూడా సావిత్రి గారికి సంబంధించి బెస్ట్ వర్షన్ వీడియోస్ చేసి నాకు పంపించండి. నాకు నచ్చిన వీడియోస్ చేసిన వారికి స్పెషల్ గిఫ్ట్ పంపిస్తాను' అంటూ ముద్దు ముద్దుగా చెప్పింది. మరి ఇంకెందుకు ఆలస్యం సావిత్రి గారి వీడియోస్ స్పెషల్‌గా తయారుచేసి సమంత గిఫ్ట్ కొట్టేయండి. 
 
సమంత గిఫ్ట్ అంటూ అభిమానులకు ఆతృత కలిగిస్తూ 'మహానటి' సినిమాకు వెరైటీ ప్రమోషన్ చేస్తోంది. ఈమె 'మహానటి' చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో కనిపించనుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్, కీర్తిసురేష్‌తో పాటు.. మరికొంతమంది నటించారు. ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా డాటర్ నీహారిక "హ్యాపీ వెడ్డింగ్" ఆగినట్టేనా?