Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ షూటింగ్ ఎంతవరకు అయ్యింది..?

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:18 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేథా థామస్, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌ లాయర్ క్యారెక్టర్ చేస్తున్నారు. 
 
పింక్ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో సక్సస్ సాధించినట్టుగానే టాలీవుడ్‌లో కూడా సక్సస్ సాధిస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. 
 
అయితే... కరోనా వలన షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దీంతో వకీల్ సాబ్ షూటింగ్ ఆగిపోవడంతో అసలు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు అయ్యింది. ? ఎప్పుడు తెర పైకి వచ్చే అవకాశం ఉందని పవన్ అభిమానులు ఆరా తీస్తున్నారు. 
 
తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా నిడివి దాదాపు రెండున్నర గంటలు అయితే.. అందులో రెండు గంటల సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇంకా ఓ అరగంట నిడివి కల సన్నివేశాలను మాత్రం చిత్రీకరించాల్సి వుందని తెలిసింది. ఎప్పుడు షూటింగ్స్‌కి అనుమతి ఇస్తే.. అప్పటి నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. మే 15న ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అది జరగని పని. తాజా సమాచారం ప్రకారం... ఆగష్టులో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అంతా సెట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments