Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కరోనా' అవగాహన కోసం "గబ్బర్ సింగ్" గ్యాంగ్ పాట (video)

Advertiesment
Corona Awareness Song
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (11:48 IST)
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సామాజికి దూరం పాటించాలని వైద్యులతో పాటు.. నిపుణులు, ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అలాగే, చాలా మంది సెలెబ్రిటీలు కరోనా అవగాహనా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన రౌడీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రచార అవగాహనా పాటను పాడారు. ఇది సోషల్ మీడియాలో ఆలరిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ పాట గురించి తెలిసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ గ్యాంగ్‌ను అభినందిస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఆ పాటను షేర్ చేశారు. అలాగే, ప్రశంసల జల్లు కురిపించారు.
 
"కరోనాపై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న "గబ్బర్ సింగ్" సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డిగార్లకు, సింగర్ "మేఘా రాజ్", ఎడిటర్ "వేణు" మ్యూజిక్ డైరెక్టర్ "శ్రీ కోటి" గీత రచయిత "ప్రియాంక" గార్లకు, ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ఆయన ట్వీట్లు చేశారు.
 
ఈ సందర్భంగా వారి పాటను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనాపై పాటలు పాడి జాగ్రత్తలపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా నటులు డ్యాన్స్ చేసిన ఈ పాట వైరల్‌ అవుతోంది. కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ వైరస్‌పై జరుగుతోన్న యుద్ధంలో గెలుద్దామని ఆ పాట ద్వారా గబ్బర్ సింగ్‌ గ్యాంగ్‌ పిలుపునిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"రుధిరం - రణం - రౌద్రం" నుంచి ఓ తాజా వార్త.. ఏంటది?