మొగ‌ల‌య్య‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు ల‌క్ష‌లు సాయం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:04 IST)
bhemla nayak
భీమ్లా నాయ‌క్‌ను ప‌రిచ‌యం చేసే గీతానికి సాకీ ఆల‌పిస్తూ కిన్నెర మెట్ల‌పై స్వ‌రాల్ని ప‌లికించిన ద‌ర్శ‌నం మొగుల‌య్య‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు ల‌క్ష‌ల ఆర్థిక సాయం అంద‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శ‌నివారంనాడు జ‌న‌సేన పార్టీ నుంచి లిఖిత‌పూర్వ‌కంగా మీడియాకు తెలియ‌జేశారు. తెలంగాణ‌లోని ఆమ్రాబాద్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌కు చెందిన మొగుల‌య్య 12 మెట్ల కిన్నెర‌పై స్వ‌రాలు ప‌లికిస్తూ గానం చేసిన అరుదైన క‌ళాకారుడు.
 
వ‌ర్త‌మాన స‌మాజంలో క‌నుమ‌రుగ‌వుతున్న క‌ళ‌ల‌ను, క‌ళారూపాల‌ను వెలుగులోకి తెచ్చేందుకు యువ‌త‌కు తెలియ‌జెప్పేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంక‌ణం క‌ట్టుకున్నారు. మొగల‌య్య కిన్నెర మీటుతూ పాట‌లు ఆల‌పిస్తుంటారు. ప‌లు జాన‌ప‌ద క‌థ‌ల‌ను పాట‌ల రూపంలో వినిపిస్తారు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లెర్నింగ్ సెంట‌ర్ ఫ‌ర్ హ్యూమ‌న్ ఎక్స్‌లెన్సీ- ద్వారా 2ల‌క్ష‌ల రూపాయ‌లు అందించాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లో చెక్‌ను ఆయ‌న‌కు అంద‌జేయ‌నున్నార‌ని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం తెలియ‌జేసింది.
 
కాగా, భీ మ్లానాయ‌క్ పై పాడిన పాట ఇప్ప‌టికే ఆద‌ర‌ణ పొందింది. అయితే త‌మ‌న్ బృందం పాడిన పాట‌లో సాహిత్యం త‌ప్పుగా వుంద‌ని ప‌లువురు విమ‌ర్శించారు. 
 
భీమ్లానాయ‌క్ సాంగ్ హమ్మింగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మరి లేటెస్ట్ గానే 12 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న ఈ సాంగ్ ఇంకా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments