Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (09:00 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం నుంచి హోళీ పండుగ సందర్భంగా మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఈ చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ తాజా పోస్టరులో పవన్‌తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ పవన్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకుముందు మార్చి 28వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆ తేదీని మార్చారు. విడుదల తేదీని మే నెల 9వ తేదీకి వాయిదా వేశారు. 
 
ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడిలు దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే కథ నేపథ్యంలో రెండు భాగాలుగా తీస్తున్నారు. నిధి అగర్వాల్‌తో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేరా, సునీల్ తదితరులు నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments