Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kiran Abbavaram: యాభై మందిలో నేనొక్కడినే మిగిలా, అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా : కిరణ్ అబ్బవరం

Advertiesment
Kiran Abbavaram Spech

దేవీ

, బుధవారం, 12 మార్చి 2025 (11:29 IST)
Kiran Abbavaram Spech
సినిమారంగంలోకి రావాలని చాలామంది యువత కలలుకంటుంటారు.  ఆ కలలు నిజం చేసుకునేందుకు దూరప్రాంతాలనుంచి హైదరాబాద్ వస్తుంటారు. అందులో నిలబడేది ఒక్కిరిద్దే. అలా నిలబడిన వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. గోదావరి జిల్లానుంచి సినిమాలోకి ప్రవేశించాలని హైదరాబాద్ వచ్చారు. ఆయనతో పాటు 50 మంది వచ్చారు. స్టూడియోల చుట్టూ తిరుగుతూ, సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, క్రిష్ణానగర్ లో వుండేవారు. అక్కడే వున్న బావార్చీ బిర్యానీ సెంటర్ లో వారంతా కలుసుకునేవారు. గణపతి కాంప్లెక్స్ దగ్గర కబుర్లు చెప్పుకునేవాళ్ళం.
 
కాలక్రమేణా వారంతా ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఫైనల్ గా నేను ఒక్కడినే మిగిలాను. ఇక్కడ ప్రతీ రూపాయి చాలా కష్టపడాలి, ఖర్చుకూడా జాగ్రత్త గా పెట్టాలి.   ఆ తర్వాత ఎ స్. ఆర్. కళ్యాణ మండపం తీశాను. ఆ తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. ఇప్పుడు క సినిమాతో స్థిరపడ్డాను. త్వరలో నేను చేసిన దిల్ రుబా విడుదలకాబోతుంది. అందుకే నేను ఓ నిర్ణయాన్ని తీసుకున్నా.
 
సినిమాపై కసి, పట్టుదలతో టాలెంట్ వున్నవారిని ఏడాదికి పదిమందిని సాయం చేయాలని నిర్ణయించుకున్నా. సీనియర్ హీరోలు ఇలా సాయం చేశారు. స్పూర్తిగా నేను ఏదో చేయాలని అనుకుంటున్నా. ఈ రోజు నుంచి ఓ మాట ఇస్తున్నా. ప్రతి ఏడాది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వారికి ఫైనాన్షియల్ గా ఇబ్బందిపడేవారికి ఫుడ్, స్టేకాబచ్చు, స్కిల్ సెట్ కావచ్చు. వారిని ఆదుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ పి.జి.కి డబ్బులు కట్టుకోలేక, తినడానికి లేకుండా తిరిగి వెళ్ళిపోతున్న వారిని ఆదుకోవాలని డిసైడ్ అయ్యాను అని తెలిపారు. కొత్తవారితో సినిమాలు చేయడానికి సిద్ధంగా వున్నాను అన్నారు.
 
సినిమా పిచ్చి అనండి. అందులో ఆనందంగా వేరు. కోట్లు సంపాదించినా సినిమా చేశామనే కిక్ గురించి వర్ణించలేం. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ రేవంత్ రెడ్డి ని కలవడంలో మోహన్ బాబు, విష్ణు ఆనందం- ఆంతర్యం!