mohanbabu, revanthreddy, vishnu
నిన్న హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని మంచు మోహన్ బాబు, విష్ణు కలిసినట్లు విష్ణు సోషల్ మీడియాలో తెలియజేస్తూ పోటొలు పోస్ట్ చేశారు. అనేక ముఖ్యమైన అంశాలను చర్చించడం చాలా అద్భుతంగా ఉంది. మన రాష్ట్రం మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వృద్ధికి ఆయన చూపిన అచంచలమైన మద్దతు మరియు నిబద్ధతకు ధన్యవాదాలు అంటూ విష్ణు సారాంశాన్ని తెలియజేశారు.
కాగా, అదే రోజు గద్దర్ అవార్డుల ప్రకటన జరిగింది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరును రేవంత్ రెడ్డి మార్చడం జరిగింది. గత ప్రభుత్వం 2013 నుంచి ఇవ్వని అవార్డులను కూడా కలిపి పదేళ్ళ అవార్డులను ప్రకటించనున్నట్లు దిల్ రాజు ఎఫ్.డి.సి. ఛైర్మన్ హోదాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ పెద్దలతో మీటింగ్ కూడా వేశారు.
అయితే, మంచు కుటుంబం ప్రస్తుతం వివాదాలను ఎదుర్కొంటుంది. దానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలని పలువురు పెద్దలు సూచించనమీదట రేవంత్ రెడ్డిని కలిసినట్లు ఫిలింనగర్ లో కథనాలు వినిపిస్తున్నాయి. పనిలోపనిగా ఇండస్ట్రీ సమస్యలు కూడా చర్చించామని విష్ణు తెలియజేశారు. అందులో భాగంగా గద్దర్ అవార్డుల కోటాలో మంచు విష్ణు నటించిన సినిమాల ప్రస్తావన కూడా వచ్చిందని విశ్వసనీయ సమాచారం. మంచు విష్ణు 2013 లో దూసుకెళ్తా, 2014 లో పాండవులు పాండవులు తుమ్మెద, దాసరినారాయణ ఆధ్వర్యంలో ఎర్ర బస్సు, 2015 లో డైనమైట్, 2016 లో ఈడోరకం ఆడోరకం, ఆ తర్వాత లక్కున్నోడు, ఆచారి అమెరికా యాత్ర, మోసగాళ్ళు వంటి సినిమాలు చేశారు. కొన్నింటికి నిర్మాతగా వున్నాడు. వాటిల్లో దేనికైనా గద్దర్ అవార్డు వస్తాయని ఆశించేలా వారి కలయిక వుందని గుసతుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుండగా, తాజాగా విష్ణు నటించిన కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా ఫంక్షన్ కూడా హైద్రాబాదు లో గ్రాండ్ గా చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విష్ణు ఆపధర్మ ప్రెసిడెంట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. కాలపరిమితి అయినా ఇంకా ఎన్నికలు నిర్వహించలేదు. ఆ మధ్య నాగబాబు కూడా ఎన్నికలు జరగాలని తన టీమ్ ద్వారా సూచించారు. కానీ ఇప్పుడు ఆయన ఎ.పి. రాజకీయాల్లో కీలక బాధ్యత స్వీకరించబోతున్నారు కాబట్టి మా గురించి ఆలోచించే తీరికలేదని సన్నిహితులు తెలియజేస్తున్నారు.