గౌరీతో పాతికేళ్ల స్నేహబంధం - యేడాదిగా డేటింగ్ చేస్తున్నా : అమీర్ ఖాన్

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (08:39 IST)
బెంగుళూరుకు చెందిన ఓ బిడ్డ తల్లి గౌరీ స్ప్రత్‌తో పాతికేళ్లుగా స్నేహబంధం కొనసాగుతుందని, గత యేడాదికాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వెల్లడించారు. తన 60వ పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాభారతం', బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్‌లతో స్నేహం, గౌరీతో డేటింగ్ తదితర అంశాలపై ఆయన మనసువిప్పి మాట్లాడారు. 
 
ముఖ్యంగా గౌరీతో గత పాతికేళ్ళుగా స్నేహం ఉందన్నారు. అయితే, గత యేడాది కాలంగా తామిద్దరం డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. బెంగుళూరుకు చెందిన ఆమె తన ప్రొడక్షన్ హౌస్‌లో పని చేస్తున్నారని తెలిపారు. పైగా, గౌరీకి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని చెప్పాడు. 2021లో తన భార్య కిరణ్ రావుతో అమీర్ విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. అంతకుముందు ఆయన రీనా దత్తాను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు.
 
తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాభారతం' స్క్రిప్టు పనులు ప్రారంభించినట్టు చెప్పారు. స్క్రిప్టు వర్క్ మాత్రమే మొదలు పెడుతున్నామన్నారు. దీనికోసం ఒక టీమ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నామన్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం తాము ఎన్నో విషయాల గురించి అన్వేషిస్తున్నామని, ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఇకపోతే సల్మాన్, షారూక్ ఖాన్‌లతో మంచి అనుబంధం ఉందన్నారు. బుధవారం కూడా వారిద్దరిని కలిసినట్టు చెప్పారు. తమపై మీడియాలో వచ్చే గాసిప్స్‌పైనే ప్రధానంగా తమ మధ్య చర్చ జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments