Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని అరుదైన ఫొటోలను ఫోను కెమెరాలో బంధించాను : రేణూ దేశాయ్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (17:19 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో కింద.. కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేయాల్సిన అవసరం ఉంది అనే క్యాప్షన్ పెట్టారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రేణూ దేశాయ్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. పిమ్మట జనసేనాని పవన్ కల్యాణ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి దూరమైన తర్వాత మరాఠి సినిమాల్లో ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. 
 
అయితే, పిల్లలిద్దరినీ తన వద్దనే ఉంచుకుని ఒక తల్లిగా ఆమె వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తనకు వీలు ఉన్నప్పుడల్లా పూణెకు వెళ్లి తన పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు.
 
ఈ క్రమంలో రేణు దేశాయ్ తాజాగా ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ పెట్టారు. 
 
కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలపై నెటిజెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments