Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్... స్లిమ్‌గా కనిపించాలని లిక్విడ్ డైట్..?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (13:17 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫిజిక్ మీద కాస్త ఫోకస్ తగ్గించినట్లు కనిపించింది. సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్ పైనే ఫోకస్ పెట్టిన పవన్.. లుక్ విషయంలో కూడా పెద్దగా కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడైన తర్వాత 'వకీల్ సాబ్' చిత్రం కోసం లుక్ లో కాస్త వేరియేషన్ చూపించాడు. 
 
ఈ క్రమంలో సన్నగా మారడం కోసం ఇప్పుడు పవన్ కేవలం ద్రవ పదార్ధాలను మాత్రమే తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తున్నాడట. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది బాలీవుడ్ 'పింక్' చిత్రానికి రీమేక్ అయినప్పటికీ తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేశారట.
 
కాగా వకీల్ సాబ్ చిత్రంలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ కోసం ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని కూడా క్రియేట్ చేసారట. అందులో పవన్ సన్నగా కనిపించాల్సి ఉండగా.. దాని కోసం లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడట. పవన్ గతంలో 'జానీ' సినిమా కోసం కష్టపడి సన్నగా మారాడు. అలానే చాతుర్మాస్య దీక్ష సమయంలో కూడా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు మాత్రం లిక్విడ్ డైట్ ని పాటిస్తూ సన్నాబడాలని చేస్తున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

పెంపుడు శునకానికి పిల్లలు... వేడుకగా బారసాల (వీడియో వైరల్)

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments