Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి' పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది. పవన్‌తో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ జతకలిస్తే ఇక చెప్పనక్కర్

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (14:25 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది. పవన్‌తో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ జతకలిస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన చిత్రమే 'అజ్ఞాతవాసి'. గతంలో వీరిద్దరూ కలిసి తీసిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. దీంతో 'అజ్ఞాతవాసి'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం కూడా.
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ చిత్రంలో నటించినందుకు హీరోగా పవన్ కళ్యాణ్, దర్శకత్వం వహించినందుకు త్రివిక్రమ్ ఏ మేరకు పారితోషికం తీసుకున్నారనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ మొదలైంది. అయితే, ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు 'అజ్ఞాతవాసి' సినిమాకిగాను త్రివిక్రమ్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకోగా, హీరో పవన్‌కి రూ.30 కోట్ల పారితోషికం ముట్టిందని చెప్పుకుంటున్నారు. ఇద్దరి పారితోషికమే రూ.50 కోట్ల వరకూ అయిందన్న మాట. ఇక యువ సంగీత దర్శకుడిగా అనిరుథ్ రవిచంద్రన్‌కు రూ.3 కోట్ల వరకూ ముట్టినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments