'అజ్ఞాతవాసి'ని చూసి 'సాహో' జాగ్రత్తపడుతున్నాడు... ఎందుకో తెలుసా?
అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సంగా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు... ఈ చిత్రం రీమేక్ హక్కులను టీ-సిరీస్ కలిగి వున్నదనీ, దానితో టి.సిరీస్ కు ఏ
Publish Date: Thu, 11 Jan 2018 (14:04 IST)
Updated Date: Thu, 11 Jan 2018 (14:07 IST)
అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సంగా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు... ఈ చిత్రం రీమేక్ హక్కులను టీ-సిరీస్ కలిగి వున్నదనీ, దానితో టి.సిరీస్ కు ఏకంగా రూ. 20 కోట్లు ఇచ్చి సమస్యను పరిష్కారం చేసుకున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రం సాహో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్లు భోగట్టా. ఈ చిత్ర దర్శకుడు సుజిత్ కూడా ఓ హాలీవుడ్ చిత్రం నుంచి కొన్ని యాక్షన్ సీన్లు కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అజ్ఞాతవాసి చిత్రానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో అలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ముందే జాగ్రత్తపడాలని సాహో చిత్ర బృందం చర్యలు తీసుకుంటోందట.
కాపీ కొట్టిన సన్నివేశాలను మక్కీకిమక్కీగా లేకుండా రీషూట్ చేయడమో లేదంటే సదరు చిత్ర నిర్మాతను కలిసి మాట్లాడటమో చేయాలని ఆలోచన చేస్తున్నారట. మరి ఇది నిజమా కాదా అన్నది చూడాల్సి వుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More