Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ కత్తి‌ను నావద్దకు 15 నిమిషాలు పంపండి : కమెడియన్ వేణు

మెగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే నటుల్లో టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ ఒకడు. చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలోని కుటుంబ సభ్యులంటే వేణుమాధవ్‌కు ఎంతో ఇష్టం.. ప్రాణంతో సమానం.

Advertiesment
Kathi Mahes
, గురువారం, 11 జనవరి 2018 (08:48 IST)
మెగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే నటుల్లో టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ ఒకడు. చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలోని కుటుంబ సభ్యులంటే వేణుమాధవ్‌కు ఎంతో ఇష్టం.. ప్రాణంతో సమానం. అలాంటి మెగా ఫ్యామిలీలోని ఓ వ్యక్తిని విమర్శిస్తే వేణు మాధవ్ సైలెంట్‌గా ఉంటాడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో మహేష్ కత్తి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి తెలిసిందే.
 
అయితే తాజాగా మహేష్ కత్తి వ్యాఖ్యలపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. మహేష్‌ కత్తిని నా దగ్గరకు ఒక 15 నిమిషాలు పంపించండి.. నేను అతనికి క్లాస్ ఇవ్వాలి. నేను మహేష్‌కు క్లాస్ ఇచ్చే సమయంలో ఏదైనా జరిగి అతనికి దెబ్బలు తగిలితే ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తా. ఆసుపత్రిలో నేనే చేర్పిస్తా. 
 
మహేష్‌ కత్తి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేంత వరకు అయ్యే ఖర్చును నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ వేణుమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోసారి మహేష్ కత్తి మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వేణు మాధవ్ ఘాటుగానే హెచ్చరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో అడ్డంగా బుక్కయిన బుల్లితెర యాంకర్