Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కత్తికి పూనమ్ కౌర్ ఆ విషయంలో ఫుల్ సపోర్ట్.. ఏంటది?

కత్తి మ‌హేష్‌పై హీరోయిన్ పూనమ్‌కౌర్ విమర్శలు గుప్పించింది. ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలకునే వారి కంటే బిచ్చగాళ్లు ఎంతో బెటరని త‌న ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఫాట్సోని రోజూ టీవీలో

Advertiesment
Poonam Kaur
, సోమవారం, 8 జనవరి 2018 (12:49 IST)
కత్తి మ‌హేష్‌పై హీరోయిన్ పూనమ్‌కౌర్ విమర్శలు గుప్పించింది. ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలకునే వారి కంటే బిచ్చగాళ్లు ఎంతో బెటరని త‌న ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఫాట్సోని రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోందన్నారు. మ‌న‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్లకి మ‌నం ఫుడ్ అందిస్తున్నామని, ఇది చాలా గొప్ప విష‌యమని, అత‌నికి మంచి పని దొర‌కాల‌ని కోరుకుంటున్నానని క‌త్తిని ఉద్దేశిస్తూ ఆమె వ‌రుస‌గా ట్వీట్లు చేసింది. ఈ కామెంట్లకు కత్తి మహేష్ ఘాటుగా స్పందించాడు.
 
స‌ద‌రు హీరోయిన్ త‌న‌ను ఫాట్సో అంటూ మాట్లాడ‌డంతోనే ఆమె సంస్కారం ఏంటో తెలిసిందని విమ‌ర్శించారు. ప‌వ‌న్‌ మెప్పు కోసం తనపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెకు బ‌తుకుదెరువు చూపించినందుకు ఆమె త‌న‌పై విమ‌ర్శలు చేస్తున్నారని అన్నారు.
 
పూనమ్ కౌర్‌కు పవన్ కల్యాణ్ వల్లే జాబ్ వచ్చిందన్నారు. ఇంకా ఆమెకు ఆరు ప్రశ్నలు సంధించారు. వాటిని పూనమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కత్తి ఓపెన్ ఛాలెంజ్‌కు పూనమ్ కానీ పవన్ కానీ రాలేదు. దీంతో ఆదివారం ప్రెస్ క్లబ్‌లో కత్తి విమర్శలకు మళ్లీ పదును పెట్టారు. ఆపై పలు టీవీ లైవ్ షోల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కత్తికి ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు, నటి పూనం కౌర్ వ్యక్తిగత జీవితంపై సంచలన విమర్శలు చేస్తున్న కత్తి మహేష్‌ను ఆదివారం ఓ టీవీ చానల్‌లో డైరక్టర్ వివేక్.. కత్తి తల్లిని గురించి ప్రశ్న వేశాడు. కత్తి కోపంతో లైవ్ షో నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంలో పూనం కౌర్ నుంచి కత్తికి అనూహ్య మద్దతు లభించింది.
 
ఎవరైనా ఓ వ్యక్తి తల్లిని కించపరుస్తూ మాట్లాడకూడదని పూనమ్ తెలిపింది. దయచేసి కత్తి మహేష్ తల్లిని గురించి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. కత్తి మహేష్ తల్లిపై ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తగా, పూనం కౌర్ హుందాగా స్పందించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌‌ గోత్ర నామం చెప్పి...