Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా పరువు తీస్తున్నారు... మీరు స్పందించాలి : పవన్‌కు పూనమ్ వినతి

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చేస్తున్న విమర్శలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. అతను తన పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారనీ అందువల్ల తక్షణం స్పందించాలంటూ పూనమ్ కౌర్ విజ్ఞప్తి చేశారు.

Advertiesment
నా పరువు తీస్తున్నారు... మీరు స్పందించాలి : పవన్‌కు పూనమ్ వినతి
, సోమవారం, 8 జనవరి 2018 (15:25 IST)
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చేస్తున్న విమర్శలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. అతను తన పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారనీ అందువల్ల తక్షణం స్పందించాలంటూ పూనమ్ కౌర్ విజ్ఞప్తి చేశారు. 
 
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, కత్తి మహేష్‌కు మధ్య మాటలయుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ వివాదంలో పూనమ్ కౌర్ తలదూర్చారు. దీంతో ఆమెను కూడా కత్తి మహేష్ ఏకిపారేశారు. 
 
ఈ నేపథ్యంలో పవన్‌కు పూనమ్ ఓ విజ్ఞప్తి చేశారు. కొందరి రాజకీయ కారణాలకు, రహస్య ఎజెండాలకు తాను లక్ష్యంగా మారానని ఆమె వాపోయింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కల్పించుకుని తన గౌరవాన్ని కాపాడాలని వేడుకుంటూ వరుస ట్వీట్లు పెట్టింది.
 
"గౌరవనీయ పవన్ కల్యాణ్‌గారూ. ఈ నా పరిస్థితి నుంచి దయచేసి బయట పడేయండి. ఎందుకంటే, ఇది నా కెరీర్, కుటుంబంతో పాటు ముఖ్యంగా నా గౌరవానికి సంబంధించిన విషయం" అని ఓ ట్వీట్‌లో వ్యాఖ్యానించింది. 
 
ఆపై "రహస్య అజెండాలతో వస్తున్న వారికి లక్ష్యంగా నేను మారాలని అనుకోవడం లేదు. నేను మిమ్మల్ని కలిసి ఈ విషయంలో మాట్లాడుతాను" అని పవన్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ చేసింది.
 
దీంతో పూనంకు మద్దతుగా పవన్ అభిమానుల నుంచి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కొద్దిసేపటి తరువాత పూనం సదరు ట్వీట్లను డిలీట్ చేసింది. అప్పటికే స్క్రీన్ షాట్స్‌గా మారిన ఈ ట్వీట్స్ ఇప్పుడు ఇమేజ్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజల్, శ్రుతి, తమన్నా.. ఇప్పుడేమో రకుల్ కావాలంటోన్న అక్షయ్ కుమార్