Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు, గెడ్డం పెంచి బాబాలా మారిన పవన్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాక్...

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (14:10 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే... ఈ సినిమా మాత్రం ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే... పవన్ కళ్యాణ్ గెడ్డం పెంచేసి... జుత్తు పెంచేసి అచ్చు బాబాలా కనిపిస్తుంటే.. పవన్ అభిమానులు ఏంటి ఇలా కనిపిస్తున్నాడు. త్వరలో షూటింగ్ అంటున్నారు లుక్ మార్చరా..? అనే డౌట్ ఉండేది.
 
వకీల్ సాబ్ సినిమాకు సైన్ చేసిన తర్వాతే పవన్ గడ్డం, లాంగ్ హెయిర్ తీసేసి ట్రిమ్ లుక్ చేసుకున్నారు. మళ్ళీ ఈ మధ్య లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో పవన్ మళ్ళీ గడ్డం పెంచేసి కనిపించారు. కొన్ని నెలల తరబడి ఆయన్ను అలా చూసి చూసి అభిమానులకు బోర్ కొట్టింది. అందుకే కొత్త లుక్ ట్రై చేస్తే చూడాలనుకున్నారు.
 
కొందరైతే... ఇంతలా మారిపోయారు. మళ్ళీ పాత లుక్ రావడం కుదిరే పనేనా అనుకున్నారు. కానీ పవన్ అందరికీ షాకిస్తూ పాత లుక్‌లో సరికొత్తగా కనిపించారు. అవును.. పవన్ సినిమా కో్సం లుక్ మార్చారు. లేటెస్ట్‌గా మారిన లుక్ బయటకు వచ్చింది. ఈ లుక్ చూసిన అభిమానులు హమ్మయ్య అంటూ ఖుషీ అవుతున్నారు.
 
ప్రస్తుతం ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి.
 
వకీల్ సాబ్ సంక్రాంతికి రావడం పక్కా అంటున్నారు. నిర్మాత దిల్ రాజు మాత్రం రిలీజ్ డేట్ గురించి ఏం చెప్పడం లేదు. మరి.. త్వరలో వకీల్ సాబ్ రిలీజ్ పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments