Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్... మీ కోసం ఇలా చేయాలనిపించింది... పవన్‌కు చెర్రీ బర్త్‌డే విషెస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీన కళ్యాణ్ బాబాయ్ పుట్టిన రోజని, ఆ రోజున సర్‌ప్రైజ్ ఇస్తానంటూ ఒక రోజు ముందుగానే

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (12:19 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీన కళ్యాణ్ బాబాయ్ పుట్టిన రోజని, ఆ రోజున సర్‌ప్రైజ్ ఇస్తానంటూ ఒక రోజు ముందుగానే చెర్రీ ట్వీట్ చేశాడు.
 
ఆ ప్రకారంగానే ఆదివారం పవన్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. నిజానికి ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డం లేదు కాబ‌ట్టి త‌న సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసి మెగా ఫ్యాన్స్‌కి ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇస్తార‌ని అంద‌రు ఊహించారు. కానీ, అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ తాను ఓ వీడియోని పోస్ట్ చేశాడు. 
 
'బాబాయ్ మీ ప్రేర‌ణ‌తోనే జీవితంలో, సినిమాల‌లో ధైర్యంగ‌ల విష‌యాలు చేశాను. మొద‌టిసారి మీ పుట్టిన రోజు సంద‌ర్భంగా మీ కోసం ఇలా చేయాల‌నిపించింది. ఇది మీకే అంకితం' అంటూ పోస్ట్ పెట్టాడు చెర్రీ. ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాలో చెర్రీ బిజీగా ఉన్నాడు.
 
నిజానికి పవన్ అంటే చెర్రీకి అమితమైన ఇష్టం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త‌ను న‌టించిన 'రంగ‌స్థ‌లం' చిత్ర స‌క్సెస్ వేడుక‌కి గెస్ట్‌గా వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స్టేజ్‌పైనే ముద్దు పెట్టి త‌న ప్రేమ‌ని అంద‌రికీ తెలియ‌జేశాడు. అలాగే, పుట్టిన రోజున కూడా తన ప్రత్యేకతనా చాటుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments