Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ్ బాబాయ్... అపార శక్తి మీకుంది : అల్లు అర్జున్

జనసేన అధిపతి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను ఆదివారం (సెప్టెంబరు 2వ తేదీ) రోజున ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రకాలైన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (11:34 IST)
జనసేన అధిపతి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను ఆదివారం (సెప్టెంబరు 2వ తేదీ) రోజున ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రకాలైన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకుసాగుతున్నారు.
 
ఈ పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో 'పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ బాబాయ్. మీకు ఓ సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ.. ఒక మంచి సమాజం కోసం పోరాటం చేస్తూ, మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను నేను ఆరాధిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కృషి కొన్ని లక్షల హృదయాలను గెలుచుకుంది. వారందరి ప్రేమ, అపార శక్తి మీకు ఉంటుంది' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా, మెగా ఫ్యామిలీ హీరోగా తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ పొందారు. ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో సినీ అభిమానులకు దగ్గరై అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పవన్ అంటే అభిమాన లోకం ఊగిపోతోంది.. పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేయాడానికి సిద్ధంగా ఉంది. కేవలం అభిమానులే కాదు ఇండస్ట్రీలోని పలువురు నటులు సైతం పవన్ కళ్యాణ్‌ని ఆరాధిస్తారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments