Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో జనసేన-సీపీఎం పొత్తు.. త్వరలోనే తమ్మినేని-పవన్ భేటీ

ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కలిసి పనిచేద్ధామని సీపీఎం జనసేనను ఓ లేఖలో కోరింది. తెలంగాణలోనూ జనసేనతో కలిసి పనిచేసేందుకు సుముఖత చూపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్

Advertiesment
తెలంగాణలో జనసేన-సీపీఎం పొత్తు.. త్వరలోనే తమ్మినేని-పవన్ భేటీ
, మంగళవారం, 28 ఆగస్టు 2018 (10:19 IST)
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కలిసి పనిచేద్ధామని సీపీఎం జనసేనను ఓ లేఖలో కోరింది. తెలంగాణలోనూ జనసేనతో కలిసి పనిచేసేందుకు సుముఖత చూపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ నేపథ్యంలో తమ్మినేని విజ్ఞప్తిని జనసేన సానుకూలంగా స్పందించింది. 
 
తమ్మినేని వీరభద్రంతో చర్చించాలని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ నిర్ణయం తీసుకొంది. ఏపీ రాష్ట్రంలో  సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేస్తామని జనసేన ప్రకటించింది. ఈ మేరకు ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. అయితే ఏ సీట్లలో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
 
మరోవైపు తెలంగాణలో కూడ ఏపీ తరహాలోనే కలిసి పనిచేయాలని సీపీఎం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు  సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనను కోరారు. తమ్మినేని చేసిన ప్రతిపాదనపై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ చర్చించింది. 
 
తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా తమ్మినేనితో నేరుగా చర్చించాలని జనసేన నిర్ణయించుకుంది. త్వరలోనే ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మురందస్తు ఎన్నికలకు కేసీఆర్ సన్నద్దమౌతున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తమ్మినేని చేసిన ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె రెండో పెళ్లి చేసుకుంది.. పెంపుడు తండ్రి వేధింపులు.. సెల్‌ఫోన్ వాడొద్దన్నాడు.. అంతే?