అమీర్ సత్యమేవ జయతే... పవన్ బుల్లితెర షో పేరు 'ఇల్లేమో దూరం... అసలే చీకటి...'
ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టి, చాలావరకు జనాదరణ పొందడంలో సక్సెస్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. పలు సామాజిక, రాజకీయ సమస్యలపై స్పందిస్తూ తన పరిధి మేరకు పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రానున్న ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్
ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టి, చాలావరకు జనాదరణ పొందడంలో సక్సెస్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. పలు సామాజిక, రాజకీయ సమస్యలపై స్పందిస్తూ తన పరిధి మేరకు పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రానున్న ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతానని మేనిఫెస్టోని కూడా ప్రకటించేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థ పవన్ కళ్యాణ్ ముందుకు ఒక ప్రతిపాదనను తీసుకువచ్చింది.
హిందీలో అమీర్ ఖాన్ చేస్తున్న కార్యక్రమం సత్యమేవ జయతే గురించి అందరికీ తెలిసిందే. పలు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే ఈ ప్రోగ్రామ్ తెలుగులో కూడా డబ్బింగై ప్రసారమవుతోంది. కానీ హిందీలో ఉన్నంత ఆదరణ మాత్రం ఇక్కడ దక్కడం లేదు. ప్రస్తుతం ఇదే తరహాలో పవన్ కళ్యాణ్‌లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది ఆ మీడియా సంస్థ. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఆమోదం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను హైలెట్ చేస్తూ ఈ కార్యక్రమం ఉంటుందనే వార్త ప్రచారంలో ఉంది. సెప్టెంబర్ మాసంలో షూటింగ్ జరుపుకునే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్న ఈ కార్యక్రమానికి ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి 'ఇల్లేమో దూరం... అసలే చీకటి...' అని పెడితే ఎలా వుంటుందని ఆలోచన చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తి రేకెత్తించబోతోందని అర్థమవుతోంది.