పవన్ చిత్రానికి టైటిల్ వేటలో త్రివిక్రమ్.. పరిశీలనలో 'గోకుల కృష్ణుడు'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. 
 
అయితే, ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్‌తో పాటు మ్యూజికల్ వీడియో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తుండగా, 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'దేవుడే దిగి వచ్చినా', 'గోకుల కృష్ణుడు', 'మాధవుడు', 'రాజు వచ్చినాడో' అనే టైటిల్స్ పరిశీలనలోకి వచ్చాయి. 
 
అలాగే, 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ కూడా ఈ చిత్రానికి పరిశీలించారని, దీనిపై పూర్తి క్లారిటీ దీపావళికి రానుందని అభిమానులు భావించారు. కానీ అభిమానుల ఊహాగానాలని తలక్రిందులు చేస్తూ యూనిట్ ఓన్లీ శుభాకాంక్షలతో సరిపెడుతున్నట్లుగా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది.

దీంతో అభిమానులకి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే చిత్ర టైటిల్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మొత్తం పవన్ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ ముమ్మరంగా టైటిల్ వేటలో నిమగ్నమైవున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments