Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌ది కష్టపడే తత్వం... ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను : రేణు దేశాయ్

తన మాజీ భర్తను ఆకాశానికెత్తేసింది రేణూ దేశాయ్. ఆయనది కష్టపడే తత్వమని, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో, పవన్ నుంచి తాను హార్డ్ వర్క్, క్రమశిక్షణ, మంచి

పవన్‌ది కష్టపడే తత్వం... ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను : రేణు దేశాయ్
, సోమవారం, 16 అక్టోబరు 2017 (08:17 IST)
తన మాజీ భర్తను ఆకాశానికెత్తేసింది రేణూ దేశాయ్. ఆయనది కష్టపడే తత్వమని, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో, పవన్ నుంచి తాను హార్డ్ వర్క్, క్రమశిక్షణ, మంచితనం ఇలా ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు చెప్పారు. ఆయన ఏదైనా ఒక పని చేయాలనుకుంటే, దానిపై పూర్తి దృష్టి పెడతారన్నారు. 
 
అనుకున్నది సాధించేవరకూ ఆయన శ్రమిస్తారని చెప్పారు. ఇక అప్పుడప్పుడు ఆయన వచ్చి పిల్లల కోసం చాలా సమయాన్ని కేటాయిస్తారనీ, తనతో అనేక విషయాలు మాట్లాడతారని అన్నారు. "ఇంతమంచిగా వుండే మీరెందుకు విడాకులు తీసుకున్నారు"? అంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోతూ ఉంటారని చెప్పుకొచ్చారు. 
 
గతంలో తాను వేసుకున్న మాత్రల కారణంగా గాఢనిద్రలోకి వెళ్లగా, స్కూలు నుంచి వచ్చిన తన కుమార్తె ఆద్యా, లేపేందుకు ప్రయత్నించి, విఫలమై, అమ్మ చనిపోతుందేమోనన్న ఆందోళనతో ఏడ్చేసిందని రేణూ వెల్లడించింది. తనకు మెలకువ వచ్చిచూసేసరికి... '‘ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌' అని ఒకటే ఏడుస్తూ తన పక్కనే కూర్చొనివున్నదని చెప్పారు. 
 
దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను మనసులోనే దాచుకుంటూ, "నేను చనిపోనులే నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అని చెప్పి ఓదార్చిందట. మమ్మీని త్వరగా తీసుకు వెళ్లవద్దని దేవుడికి దణ్ణం పెట్టుకోమని చెబితే, దేవుడి ముందు పాప ఎంత సేపు కూర్చుందో కూడా తనకు తెలియలేదని రేణూ చమర్చిన కళ్లతో చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వదలి వెళ్ళొద్దంటూ 23 లక్షల మంది సాయి పల్లవికి సందేశాలు....