Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నాం.. డేటింగ్ చేశాం.. కానీ... హీరోపై హీరోయిన్ ఫిర్యాదు

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:53 IST)
తమిళ హీరో అభిశరవణన్‌పై సినీ నటి అతిథిమీనన్ ఫిర్యాదు చేసింది. ప్రేమించుకుని డేటింగ్ చేశామనీ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెళ్లి పేరుతో నకిలీ పత్రాలపై సంతకాలు చేసుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది. ఇదే అంశంపై ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తే, తన పేరు అతిథి మీనన్ అని.. పట్టాదారి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమైనట్టు తెలిపింది. ప్రస్తుతం తాను చెన్నైలో నివశిస్తున్నట్టు తెలిపింది. 
 
అయితే, తాను నటించిన తొలి చిత్రం ద్వారా మదురైకు చెందిన శరవణ కుమార్ అనే వ్యక్తి అభిశరవణన్‌గా తన పేరును మార్చుకుని హీరోగా నటించాడని పేర్కొంది. ఆ చిత్ర షూటింగ్‌ సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడని, ఆ తర్వాత నకిలీ రిజిస్టర్‌ పెళ్లి పత్రాల్లో తన చేత సంతకం చేయించాడని చెప్పింది. 
 
ఆ పిమ్మట అభిశరవణన్‌ ప్రవర్తనలో మార్పు రావడంతో తాను అతని నుంచి దూరమైనట్టు చెప్పింది. ఈ క్రమంలో తమను ఒక్కటిగా చేర్చాలని కోరుతూ అభిశరవణన్‌ మదురై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడని చెప్పింది. నిజానికి తాను ఏ రిజిస్టర్‌ కార్యాలయానికి వెళ్లి పెళ్లి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయలేదని తెలిపింది. 
 
అలాంటిది అభిశరవణన్‌ నకిలీ పెళ్లి ధ్రువపత్రాలను, తాను అతనితో దిగిన ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతను, అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. దీనిపై స్థానిక వెప్పేరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments