Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబడ్డీ ప్లేయర్‌గా 'మణికర్ణిక'

Webdunia
సోమవారం, 6 మే 2019 (10:00 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇటీవలే 'మణికర్ణిక' పేరుతో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇపుడు మరో రెండు ప్రాజెక్టుల్లో నటించనుంది. వాటిలో ఒకటి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ కాగా, మరొకటి కబడ్డీ ప్లేయర్‌గా ఆమె నటించే చిత్రం. 
 
అంతేకాకుండా, 'మణికర్ణిక' చిత్రం తర్వాత ఆమె నటించిన తాజాగా చిత్రం 'మెంటల్ హై క్యా'. ఈ చిత్రం జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. అందులో ఒకటి జయలలిత బయోపిక్ కాగా రెండోది స్పోర్ట్స్ డ్రామా 'పంగా'. ఇందులో కంగనా కబడ్డీ ప్లేయర్‌గా నటించనుంది. ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిందని సమాచారం.
 
ఇందులో కబడ్డీ ప్లేయర్ పాత్రను రియలిస్టిక్‌గా పోషించడం కోసం కంగనా ఇప్పటికే శిక్షణ కూడా తీసుకుంటోందట. అంతేకాకుండా రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తూ కసరత్తులు చేస్తోందట. అందరూ టాప్ హీరోయిన్లు రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తారు కదా మరి కంగనా చేసే కసరత్తులలో స్పెషల్ ఏంటి? అంటే ఒక ప్రత్యేకత ఉంది. 
 
కబడ్డీ ప్లేయర్స్ కాళ్లు చాలా బలంగా ఉంటాయి. అందుకే కంగనా నిజమైన కబడ్డీ ప్లేయర్ స్టైల్‌లో కనిపించేందుకు దానికి సంబంధించిన ఎక్సర్ సైజులు చేస్తోందట. దీన్నిబట్టే ఈ భామ తన పాత్రల విషయంలో ఎంత అంకితభావంతో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత జయలలిత బయోపిక్ షూటింగ్ ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments