Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా అద్వానీ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ నిర్మాతలు

Webdunia
సోమవారం, 6 మే 2019 (09:48 IST)
కియారా అద్వానీ.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "భరత్ అనే నేను" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత రాం చరణ్ నటించిన "వినయ విధేయ రామ" చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. అలాంటి కియారా అద్వానీ కోసం బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. 
 
మరోవైపు, బాలీవుడ్‌లో కూడా ఆమె దూసుకెళుతోంది. అక్కడ కూడా వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. నిజానికి ఆమె సౌత్‌ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఆశించిన గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత కొన్ని వెబ్‌సిరీస్‌లలో కూడా ఆమె నటించింది. 
 
కానీ, టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చాలా బిజీ అయిపోయింది. ఒకవైపు 'అర్జున్ రెడ్డి' రీమేక్ అయిన 'కబీర్ సింగ్' చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో రెండు సినిమాల్లో నటించేందుకు సంతకం చేసింది. 
 
వీటిలో ఒకటి "కాంచన" చిత్రం రీమేక్ కాగా, మరొకటి వుంది. వీటితో పాటు మరికొన్ని హిందీ, టాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు ఈ అమ్మడు సమ్మతించింది. ఇతర స్టార్ హీరోయిన్ల పారితోషికంతో పోల్చితే ఈ భామ పారితోషికం తక్కువగా ఉంటుందని అందుకే ఆమెను తమ సినిమాల్లో బుక్ చేసుకునేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

జీఎస్టీ ఆఫీసర్ ఇంట్లో చోరీ.. రూ.60లక్షల విలువైన నగదు, బంగారం, వజ్రాలు గోవిందా!

అమ్మ ఇంకా బతికేవుంది.. వచ్చి చంపెయ్.. ప్రియుడుకి ప్రియురాలు పిలుపు

ఆ ఐదు గ్రామాల ప్రజలకు న్యాయం చేయండి.. ప్రధానిని కోరిన కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments