Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

నన్ను చాలా పార్టీలు ఆహ్వానిస్తున్నాయి అంటున్న బాలీవుడ్ భామ

Advertiesment
Kangana Ranaut
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (15:19 IST)
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో దేశంలో జరుగుతున్న ఏ చర్చలకైనా ప్రధానాంశం రాజకీయాలుగానే ఉంటున్నాయి. ఈ తరుణంలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తనకు ఎన్నో రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చేస్తున్నాయని పేర్కొనడం ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
 
తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన కంగనా.. 'మా తాత సర్జుసింగ్‌ రాజ్‌పుత్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయాలలో పని చేసారు. అయితే ఇప్పుడు నన్ను చాలా పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. నా మాటల ద్వారా యువతపై మంచి ప్రభావం ఉంటుందని వారు భావిస్తున్నారు. కానీ నేను ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తే అన్ని వైపులా మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతాను. 
 
ప్రస్తుతం ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి చేరికలు చాలా ఎక్కువైపోతున్నాయి. కానీ మన అదృష్టం ఏంటంటే.. రక్తపాతాలు లేవు. కేవలం ఒకరిపై ఒకరు బురద జల్లుకునే సంఘటనలే జరుగుతున్నాయి. ఒకవేళ నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చినా నిస్వార్ధంగా, పార్టీకే కట్టుబడి పనిచేస్తాను' అని చెప్పుకొచ్చారు. మరి ఇది తనను ఏదైనా పార్టీ పిలవాలనే అభ్యర్థనతో కూడిన విన్నపమేమో రాజకీయ పక్షాలు కొంచెం ఆలోచించాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ ముదురు బ్యాచిలర్‌తో జోడీ కడుతున్న అక్కినేని కోడలు