Thaman: అఖండ 2: తాండవం లో పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, అతుల్‌ మిశ్రా బ్రదర్స్ ఎంట్రీ

చిత్రాసేన్
సోమవారం, 13 అక్టోబరు 2025 (07:48 IST)
Thaman with Pandit Shravan Mishra, Atul Mishra Brothers
కంపోజర్ తమన్ తాజాగా అఖండ 2 బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రారంభించారు. పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదరులు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ ప్రతిభావంతులైన సోదరులు  అఖండ 2తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
 
థమన్‌ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో వీరు సంస్కృత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారు. ఈ శ్లోకాలు, వేద మంత్రాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా వుండబోతున్నాయి. థమన్‌ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ సినిమాకి హై వోల్టేజ్‌ ఎనర్జీ అందించబోతోంది.  
 
ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అఖండ 2: తాండవం గ్రేట్ స్పిరుచువల్, యాక్షన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
 అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
 
అఖండ : తాండవం' పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్‌ భారీ బజ్ క్రియేట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు

పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....

కారును ఢీకొన్న విమానం... వీడియో వైరల్

రేవంత్ రెడ్డి విజన్ విన్నాక విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయా : ఆనంద్ మహీంద్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

తర్వాతి కథనం
Show comments