నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.
తాజాగా కర్స్ డబుల్ అప్‌డేట్‌లతో సర్ప్రైజ్ చేశారు. అఖండ 2 ఫస్ట్ లుక్, టీజర్ జూన్ 9న, బాలకృష్ణ పుట్టినరోజుకు ఒక రోజు ముందు విడుదల కానున్నాయి. ఈ పోస్టర్‌లో నంది, డమరుకంతో కూడిన త్రిశూలం కనిపిస్తుంది, దాని నేపథ్యంలో విశ్వ దిక్సూచి ఉంటుంది. ఇది NBK పుట్టినరోజుకు డబుల్ ట్రీట్ అవుతుంది. ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది.
సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు.
ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం S థమన్ సంగీతం అందిస్తున్నారు, బాలక్రిష్ణ ఫస్ట్ లుక్, టీజర్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదలచేయనున్నారు. దీనికోసం అదిరిపోయే సంగీతం, ఎఫెక్ట్ తో హైలెవల్ లో తీసుకు వస్తున్నామనీ, తగతగతగ తాండవం అదిరిపోయేలా వుంటుందని థమన్ సోషల్ మీడియాలో తెలియజేశారు. బాలయ్యబాబు తో కలిసి చేస్తున్న ఈ సినిమా మరో తీపిగుర్తుగా వుంటుందని తెలిపారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి