Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

Advertiesment
Varun Tej VT15 - Ananthapur

దేవీ

, శనివారం, 24 మే 2025 (17:30 IST)
Varun Tej VT15 - Ananthapur
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ #VT15 తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వరుణ్ తేజ్ పుట్టినరోజున విడుదలైన విజువల్లీ స్టన్నింగ్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
 
హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్, హైదరాబాద్ అనంతపూర్‌లో జరిగిన రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. అనంతపూర్‌లోని ప్రముఖ కియా గ్రౌండ్స్, అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది.
 
సినిమా ఫస్ట్ హాఫ్‌లోని థ్రిల్లింగ్ సన్నివేశాలు, పంచ్ హ్యూమర్‌తో కూడిన సీన్స్ ని ఈ షెడ్యూల్స్‌లో చిత్రీకరించారు. రీతికా నాయక్, సత్య, మిర్చి కిరణ్‌ తదితర నటీనటులు ప్రతీ సన్నివేశంలో కామెడీ మెరుపులు నింపారు.
 
వరుణ్ తేజ్, రీతికా నాయక్‌పై పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఒక అద్భుతమైన అనంతపూర్ షెడ్యూల్ హైలైట్ నిలుస్తుంది. 
 
ఇప్పుడు ఎక్సయిట్మెంట్ మరింత పెరుగుతోంది, #VT15 నెక్స్ట్ ఇంటర్నేషన్ షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ షెడ్యూల్ కొరియాలో జరుగుతుంది. ఈ పార్ట్ ద్వారా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండో-కొరియన్ హారర్-కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
గ్రాండ్ స్కేల్, స్టైల్, హారర్ బ్లెండ్ తో #VT15 జానర్ డిఫైనింగ్ సినిమాగా వుండబోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్