Webdunia - Bharat's app for daily news and videos

Install App

''పద్మావత్'' కలెక్షన్ల సునామీ.. రూ.231 కోట్ల నెట్‌తో అదుర్స్

సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించిన ''పద్మావత్'' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం భారత్‌లో

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (14:16 IST)
సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించిన ''పద్మావత్'' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం భారత్‌లో రూ.231 కోట్ల నెట్‌ను రాబట్టింది. తద్వారా 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాగా పద్మావత్ నిలిచింది.

దీపికా పదుకునే సినిమా భారీ వసూళ్లను కైవసం చేసుకున్న తరహాలో ఏ ఫీమేల్ లీడ్ సినిమా వసూళ్లను సాధించలేదు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. 
 
ఇకపోతే.. పద్మావత్ సినిమాపై బీజేపీ ఎంపీ, సీనియర్ నేత శత్రుఘ్ను సిన్హా ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని.. దీపిక పదుకునే నటన ఆకట్టుకుంటుందని తెలిపారు.

అలాగే ఈ సినిమా నిలుపుదల కోసం కర్ణిసేన చేసిన ఆందోళనను అభినందించారు. పద్మావత్ పాత్ర రాజ్‌పుత్ మహిళ వంశపారపర్యాన్ని ప్రతిబించేదిగా.. వారిని గౌరవాన్ని నిలబెట్టేదిగా వుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ధైర్యం చేసి ఈ చిత్రాన్ని రూపొందించారని శత్రుఘ్ను సిన్హా కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments