Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''పద్మావత్'' సినిమా భలే.. ఆందోళనను విరమిస్తున్నాం : కర్ణిసేన ముంబై చీఫ్

దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన ''పద్మావత్'' సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కానీ ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని కర్ణిసేన ఆందోళన చేపట్టింది. ఈ చిత్రం విడుదలకు అడుగడుగునా

''పద్మావత్'' సినిమా భలే.. ఆందోళనను విరమిస్తున్నాం : కర్ణిసేన ముంబై చీఫ్
, శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:18 IST)
దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన ''పద్మావత్'' సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కానీ ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని కర్ణిసేన ఆందోళన చేపట్టింది. ఈ చిత్రం విడుదలకు అడుగడుగునా అడ్డు తగిలింది. పద్మావత్ సినిమాపై ఆగ్రహాన్ని ఆందోళన ద్వారా వ్యక్తం చేసింది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడి చేసింది.
 
సినిమాను ఆపాలని బెదిరించింది. నటీనటులను హెచ్చరించింది. విడుదలకు ఒక్క రోజు ముందు స్కూల్ బస్సుపై దాడి చేసింది. ఇలా ఎన్నో ఆందోళనకు కారణమైన కర్ణిసేన ప్రస్తుతం పద్మావత్‌పై సంచలన కామెంట్స్ చేసింది. ఇంకా ఈ చిత్రంపై సానుకూల ప్రకటన చేసింది. అంతటితో ఆగలేదు. పద్మావత్ సినిమా సూపర్ అంటూ కితాబిచ్చేసింది. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైకి చెందిన కర్ణిసేన కార్యకర్తలు శుక్రవారం పద్మావత్ సినిమాను వీక్షించారు. ఆపై మీడియాతో మాట్లాడిన కర్ణిసేన ముంబై చీఫ్ యోగేంద్ర సింగ్ కతర్.. పద్మావత్ సినిమా రాజ్‌పుత్‌ల గొప్పదనాన్ని తెలుపుతుందన్నారు. ఈ సినిమాను చూసిన ప్రతి రాజ్‌పుత్ గర్వపడతాడని వ్యాఖ్యానించారు. తాము అనుకున్నట్లే.. ఖిల్జీ, పద్మావతి మధ్య ఎలాంటి అభ్యంతర కర సన్నివేశాలు లేవని హామీ ఇచ్చారు. 
 
ఇంకా కీలకమైన ప్రకటన చేశారు. పద్మావత్‌పై ఆందోళనను విరమించుకున్నట్లు తెలిపారు. దర్శకుడు పద్మావత్‌ను అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చారు. కర్ణిసేన తాజా కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమాను దర్శకుడు కోరినప్పుడే చూసి వుంటే ఈ అనవసర రాద్దాంతం సద్దుమణిగేదని.. అలా కాకుండా సినిమా విడుదలను అడ్డుకుని.. ప్రజలకు ఆందోళనల ద్వారా కర్ణిసేన ఇబ్బందులకు గురిచేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం పాత్రలో నిత్యామీనన్?