Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (13:24 IST)
సినీ నటిగా, నాట్య కళాకారిణిగా శోభన గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో 'విక్రమ్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ బాబు వంటి అగ్ర కథానాయకుల సరసన ఆమె నటించారు. 1980-1990 మధ్య తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. నటనతో పాటు శాస్త్రీయ నృత్యం అంటే శోభనకు ప్రాణం. 
 
1989లో సొంతంగా ఓ డ్యాన్స్ స్కూల్‌ను ప్రారంభించారు. భరత నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు శోభన 1994లో 'కళార్పణ' అనే సంస్థను ప్రారంభించారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలో, నాట్యంలో శిక్షణ పొందుతున్నారు. 
 
శోభన 1970 మార్చి 21న తిరువనంతపురంలో జన్మించారు. పూర్తి కళా రంగానికే అంకితమైన శోభన ఇంతవరకూ వివాహం చేసుకోలేదు. 2011లో ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుతున్నారు. కళా రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో శోభనను సత్కరించింది. 
 
రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!! 
 
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్.. వెండితెరపై రీల్ హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ రియల్‌ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఫలితంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. 
 
దేశంలోనే వెండితెరపై హీరోయిజాన్ని ప్రదర్శించే హీరోలకు ఏమాత్రం కొదవలేదు. కానీ, నిజ జీవితంలో అలాంటి తెగువను ప్రదర్శించగల అతికొద్ది మంది హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. దక్షిణాదిన అగ్రహీరోగా ఎదిగిన అజిత్ కుమార్ 1971లో పి.సుబ్రమణ్యం, మోహిని దంపతులకు తంజావూరులో జన్మించారు.
 
ఆ తర్వాత వారి కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌కు వలస వచ్చింది. పదో తరగతితోనే చదువు ఆపేసిన అజిత్ ఎన్ఫీల్డ్ బైక్ గ్యారేజీలో మెకానిక్‌గా జీవితం ఆరంభించారు. తర్వాత సొంతంగా దుస్తుల ఎగుమతి వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆ సమయంలోనే పలు దుస్తుల బ్రాండ్స్‌కు మోడల్‌గా కూడా పని చేశారు. 
 
1990లో 'ఎన్ వీడు ఎన్ కనవర్' చిత్రంలో విద్యార్థిగా చిన్న పాత్రలో తెరపై తొలిసారి కనిపించారు. 'ప్రేమ పుస్తకం' చిత్రంలో తొలిసారి హీరోగా అజిత్ అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా విడుదలలో జాప్యం జరగడంతో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం 'అమరావతి' ముందు విడుదలైంది. 1995లో వచ్చిన 'అసై' చిత్రం సూపర్ హిట్ కావడంతో అజిత్ ఇక వెనుదిరిగి చూడలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments