ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఆవిష్కరించిన ఉమాపతి చిత్రంలో మాస్ సాంగ్

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (17:29 IST)
Umapati team with chandrabose
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ‘ఉమాపతి’ అనే సినిమా రూపొందిస్తున్నారు.  ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది.  క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాసిన పాటను విడుదల చేశారు.
 
నాకొకటి నీకొకటి అంటూ సాగే ఈ మాస్ పాటను చంద్రబోస్ రాశారు. ఆయన చేతుల మీదుగానే కాసేపటి క్రితమే ఈ పాటను రిలీజ్ చేయించారు దర్శక నిర్మాతల. ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. పల్లెటూరి వాతావరణం, రికార్డింగ్ డ్యాన్సులు, ఆ పాటలో వేసిన సెట్లు అన్నీ కూడా బాగున్నాయి. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
 
ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన అందించిన ఈ బాణీ ఎంతో క్యాచీగా ఉండటంతో పాట ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. పాటను రిలీజ్ చేసిన చంద్రబోస్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. నీకొకటి నాకొకటి అనే పాటను రిలీజ్ చేశాను. క్రిషి క్రియేషన్స్ మీద కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర డీవోపీగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో ప్రత్యేక గీతం రాసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది. పాట ఎంత బాగుంటుందో లిరికల్ వీడియో కూడా అంతే బాగుంది’ అని అన్నారు.
 
ఈ సినిమాకు రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు.
 
ఇది వరకే విడుదల చేసిన ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
తమిళ్ లో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments