Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జున గారు నా నా లక్కీ చార్మ్ : హీరోయిన్ అవికా గోర్

Advertiesment
Avika Gor
, సోమవారం, 19 జూన్ 2023 (16:06 IST)
Avika Gor
మహేష్ భట్ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హారర్ మూవీ "1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్". అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్ పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్ డా. రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించారు. జూన్ 23న ఈ చిత్రం తెలుగు విడుదల కానున్న నేపధ్యంలో అవికా గోర్ ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
1920 తో బాలీవుడ్ లో మెయిన్ లీడ్ గా పరిచయం కావడం ఎలా అనిపిస్తుంది?
మహేష్ భట్, విక్రమ్ భట్ లాంటి  లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ తో పని చేయడం అనేది నా కల. ఈ చిత్రంతో అది ఇంత త్వరగా రావడం నా అదృష్టం. ఇది నా పై ఇంకా బాధ్యత పెంచింది. ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. లుక్, ఎప్పిరియన్స్ ఇలా ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. మహేష్ భట్ గారు ఈ కథని అందించారు. ఒక యూనిక్ హారర్ సినిమా ఇది. వారి నిర్మాణంలో వచ్చే ప్రతి సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ఈ చిత్రం కోసం చాలా ఎక్సైటింగ్ ఎదురుచూస్తున్నాను.
 
హారర్ సినిమాలో చేయడం ఎలా అనిపించింది ?
నాకు హారర్ సినిమాలు చూడటం ఇష్టమే. భయపడుతూ చూస్తాను. రాజుగారి గది3 హారర్ కామెడీ. కాని 1920 సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి హారర్ సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా మరిన్ని హారర్ కథల కోసం సంప్రదిస్తారని భావిస్తున్నాను.
 
మీ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు ?
నేను నిజ జీవితంలో ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతానో అలా ఉంటే సరిపొతుందని దర్శకురాలు చెప్పారు. ఐతే ఈ సినిమా షూటింగ్ మాత్రం నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్ రియల్ ఇంజిన్ ఎల్ ఈ డీ స్క్రీన్) వాడాం. దాని కోసం ఎక్కువగా ప్రిపేర్ కావాల్సి వచ్చింది. చాలా భాగం షూటింగ్ స్టూడియోస్ లో జరిగింది. టెక్నికల్ గా చాలా డిఫరెంట్ మూవీ ఇది.
 
మహేష్ భట్, విక్రమ్ భట్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
మహేష్ భట్, విక్రమ్ భట్ గారు అద్భుతమైన వ్యక్తులు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద, ఆప్యాయత ఇస్తారు. కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. వారితో మాట్లాడుతునప్పుడు ఒక కుటుంబ సభ్యునితో మాట్లాడుతున్నట్లే వుంటుంది. నాగార్జున గారిలో కూడా ఈ క్వాలిటీ చూశాను. ఆ క్వాలిటీ వారి నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి.
 
నాగార్జున గారు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం ఎలా అనిపించింది ?
నాగార్జున గారు నా మొదటి సినిమా నుంచి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఆయన నా లక్కీ చార్మ్. మొన్న నన్ను పాన్ వరల్డ్ స్టార్ అని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో చెప్పిన మాట అది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
 
1920 లో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలు ఏమిటి ?
1920 కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హారర్ కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కూడా వుంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
 
కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
తెలుగు లో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ‘ఇందు’అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. అలాగే ఆది సాయి కుమార్ తో ‘అమరన్’ మొదలౌతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగధీరలో కాజల్ అగర్వాల్ ఎంత అందంగా ఉందొ ఇప్పుడు సత్యభామగా అంతే అందంగా ఉంది : శేఖర్ కమ్ముల