Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ భట్ నాకు గురు. చాలా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి : 1920 ట్రైలర్ లో నాగార్జున

maheshbhat, nagrajuna and others
, శుక్రవారం, 16 జూన్ 2023 (13:12 IST)
maheshbhat, nagrajuna and others
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హారర్ మూవీ "1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్". అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్ పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్ డా. రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించారు. జూన్ 23న ఈ చిత్రం తెలుగు విడుదల కానున్న నేపధ్యంలో కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. మహేష్ భట్ గారిని కలిసి దాదాపు ఇరవై ఏళ్ళయింది. కానీ ఆయన నా మనసులో ఎప్పుడూ ఉంటారు. నేను కూడా ఆయన మనసులో ఉంటాననే నమ్ముతున్నాను. ముంబై షూటింగ్స్ కి వెళితే భట్ గారి గురించి అడుగుతుంటాను. బ్రహ్మస్త్ర సినిమాలో అలియా భట్ తో వర్క్ చేశాను. ఆ సమయంలో భట్ గారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. భట్ గారు నాకు గురు. చాలా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి దారి చూపించారు. ఆయన పాటలు చేయించుకునే విధానం అద్భుతంగా వుంటుంది. ఇప్పటికీ 'తెలుసా మనసా పాట చేయించిన విధానం గుర్తుకు వస్తుంటుంది. అలాగే 'జకమ్' లో గలీ మే ఆజ్ చాంద్ నిక్లా పాట నా ఆల్ టైమ్  ఫేవరెట్. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. 1920 ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ట్రైలర్ చూస్తున్నపుడు ఒక నిశ్శబ్దం వచ్చింది. నిజంగా భయపడ్డాను. అందుకే దాన్ని పోగొట్టుకోవడానికి నవ్వాను(నవ్వుతూ). ఇలాంటి సినిమాని పెద్ద స్క్రీన్ లోనే చూడాలి. వెయ్యికి పైగా స్క్రీన్స్ లో సినిమా విడుదలవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు హారర్ సినిమాలు చూడాలంటే భయం.  కానీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది. చూడాలనిపించేలా చేశారు. హారర్ సినిమాలు చూసినప్పుడు ఆ కిక్కే వేరు. కృష్ణ అద్భుతంగా తీసింది. అవికా గోర్ డిఫరెంట్ పాత్రలు చేస్తుంది. ఈ సినిమా తన కెరీర్ లో పెద్ద  హిట్ కావాలి. జూన్ 23న ఈ సినిమా వస్తోంది. రేపు ఒక పెద్ద సినిమా ప్రభాస్ ఆదిపురుష్ వస్తుంది.  ప్రభాస్ అండ్ టీంకి ఆల్ ది బెస్ట్. సినిమా అందరినీ మళ్ళీ థియేటర్ లోకి తీసుకురావాలి''అన్నారు.  
 
మహేష్ భట్ మాట్లాడుతూ.. నాగార్జున గారిని చాలా రోజుల తర్వాత కలవడం ఆనందంగా వుంది. నాగార్జున గారి వలన ఈ సినిమాని తెలుగు విడుదల చేయడం సాధ్యపడింది. ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. విక్రమ్ భట్ ఈ చిత్రం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ చిత్రం సరికొత్త టెక్నాలజీని వాడాం. అవికా గోర్, కృష్ణ, విక్రమ్ అందరూ కలిసి మంచి టీం వర్క్ చేశారు. నాగార్జున గారితో క్రిమినల్ సినిమా చేస్తున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. నాగార్జున గారు వాళ్ళ నాన్నగారి విలువలు, సంస్కారం ముందుకు తీసుకువెళ్తున్నారు. విలువలు, సంస్కారంను కాపాడుకోవడం చాలా ముఖ్యం. 1920 కథ కూడా దీని గురించే. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.  
 
అవికా గోర్ మాట్లాడుతూ.. నాగార్జున గారు నా మొదటి సినిమా ఉయ్యాల జంపాల నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు నా తొలి హిందీ చిత్రం 1920 ట్రైలర్ లాంచ్ కి ఆయన రావడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారికి బిగ్ థాంక్స్. 1920 చాలా స్పెషల్ మూవీ. ఇప్పటివరకూ నేను చేయనని జోనర్ సినిమా ఇది. ఎమోషన్ డ్రామా అన్నీ వుంటాయి. జూన్ 23న సినిమా వస్తోంది. అందరూ థియేటర్ లో చూసి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.
 
కృష్ణ భట్ మాట్లాడుతూ..1920 నా మనసు నుంచి వచ్చిన చిత్రం. ఇదొక ఎమోషనల్ స్టొరీ. హారర్ లో ఎమోషన్ ప్రయత్నించడం ఇదే తొలిసారి. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది'' అన్నారు. సంజయ్, దిలీప్ సోనీ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ అలరిస్తాడా! రివ్యూ రిపోర్ట్‌