Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైఫ్‌ను మిస్సవుతున్నా.... ప్రీతి జింటా

బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రీతి జింటా కలిసి నటించిన చిత్రం 'సలామ్ నమస్తే'. ఈ చిత్రం విడుదలై సెప్టెంబరు 10వ తేదీకి 13 యేళ్లు పూర్తయింది.

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:44 IST)
బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రీతి జింటా కలిసి నటించిన చిత్రం 'సలామ్ నమస్తే'. ఈ చిత్రం విడుదలై సెప్టెంబరు 10వ తేదీకి 13 యేళ్లు పూర్తయింది. దీన్ని పురస్కరించుకుని ప్రీతి జింటా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ట్వీట్ చేసింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఎదురైన సంఘటనలు, జ్ఞాపకాలను మరోమారు ఆమె నెమరువేసుకున్నారు.
 
"వావ్‌. సినిమా షూటింగ్‌ సమయంలో ఎంతో ఎంజాయ్‌ చేశాను. కెమెరా ముందు, వెనుక కూడా సైఫ్‌తో విపరీతంగా గొడవ పడేదాన్ని. ఒక్కోసారి నటించడంమానేసి జీవించేదాన్ని. దీంతో నేను సైఫ్‌ను నిజంగానే చంపేస్తానేమో అని సిబ్బంది కంగారుపడేవారు. అంతలా కొట్టుకునే వాళ్లం. సైఫ్‌ను మిస్సవుతున్నా. సలామ్‌ నమస్తేకు 13 ఏళ్లు పూర్తయ్యాయి" అంటూ పోస్ట్ చేసింది. 
 
ఇకపోతే, ప్రీతి జింటా సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి తన స్నేహితుడు జీన్ గుడెనఫ్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వ్యాపారాల్లోకి ప్రవేశించింది. ఐపీఎల్ జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌‌కు సహ యజమానిగా ప్రీతి జింటా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments