Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగ్యా నైనా అలీ రెజాల పై పాట చిత్రీకరణ

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:03 IST)
Pragya Naina,
పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వైజాగ్ లో కంటిన్యూస్ గా 20 రోజుల షూటింగ్ తో టాకీ పార్ట్  పూర్తి చేసుకుంది.
 
వైజాగ్ షెడ్యుల్ లో నరేష్ అగస్త్య,  రాజేంద్రప్రసాద్, హీరోయిన్ శ్వేత అవస్తి, సెకండ్ హీరోయిన్ ప్రగ్యా నైనా, అలీ రెజాల పై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించారు. దీంతో 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలుంది. ఈ రెండు పాటలని బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మార్చి లో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  
 
ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం కోసం ఖర్చు చేశారు. వైజాగ్ లో రుషికొండ, తొట్లకొండ బీచ్, యారాడ బీచ్ , అరకు లాంటి అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించాం. అవుట్ డోర్ షూటింగ్ కి వైజాగ్ అన్ని విధాల అనుకూలంగా వుంది’’ అని అన్నారు.
   
ప్రముఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోహిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు వున్నాయి.  అనూప్ రూబెన్స్ బ్యూటీఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేశారు.  ఈ చిత్రానికి  కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments