Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదేళ్ల క్రితం మేం ఈ పని చేశాం : మెన్ టూ గురించి శ‌ర్వానంద్‌

Men Two team with Sharwanand
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (09:53 IST)
Men Two team with Sharwanand
నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌కి హీరో శ‌ర్వానంద్ ముఖ్య అతిథిగా హాజ‌రై టీజ‌ర్‌ను లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ప్రొడ్యూసర్‌ హీరో మౌర్యకి కంగ్రాజులేషన్స్. రణరంగం సినిమాలో ఇద్దరం కలిసి నటించాం. ప్రతి స్టెప్‌ నాకు చెప్పేవాడు. తను ప్రొడ్యూస్‌ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎందుకు ప్రొడక్షన్‌ అని చెప్పా. అతను స్క్రిప్ట్ నచ్చి సినిమా చేశాడు. యంగ్‌స్టర్స్ కొత్తగా ఇలా చేస్తుంటే బాగా అనిపించింది. మేము ప్యాషన్‌తో, నమ్మకంతో, ఆశతో సినిమా చేస్తాం. పదేళ్ల క్రితం మేం ఈ పని చేశాం. మౌర్య తండ్రి కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ప్రొడ్యూసర్‌గా కూడా మౌర్య సక్సెస్‌ అయ్యాడని, బిజినెస్‌ బాగా జరిగిందని విన్నా. టీమ్‌కి కంగ్రాజులేషన్స్. కష్టపడితే, మంచి సినిమా చేస్తే తప్పక అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అని అన్నారు.
 
డైరెక్టర్ సుధీర్‌ వర్మ మాట్లాడుతూ ''టీజర్‌ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నాకు స్టోరీ తెలుసు. మౌర్య సినిమా కూడా చూపించాడు. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్ '' అని అన్నారు.
 
డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘టీజర్‌ని లాంచ్ చేసిన శ‌ర్వానంద్‌కి థాంక్స్‌. మౌర్య యాక్ట‌ర్‌గా జ‌ర్నీ స్టార్ట్ చేసి ఈ సినిమాతో నిర్మాత‌గా కూడా మారాడు. త‌ను ప్రొడ్యూస‌ర్ అవుతాన‌ని అనగానే ఎందుకు.. వ‌ద్దు అని చెప్పాం. కానీ త‌ను ప్యాష‌న్‌తో సినిమా చేశాడు. త‌న‌కు ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డ‌బ్బులు బాగా రావాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 
 
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘‘ఆడ‌వాళ్ల గురించి, వాళ్లు ప‌డే బాధ‌లు గురించి సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌గ‌వాళ్ల మీద సినిమా వ‌చ్చింది. అదే మెన్ టూ. ఏదో ఆడ‌వాళ్ల‌ని త‌క్కువ చేసి చూపించాల‌నే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. లేడీస్ వ‌ల్ల జెంట్స్ ఎంత బాధ‌ప‌డుతున్నారు.. వాళ్ల వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను జెన్యూన్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. మ‌గ‌వాళ్ల బాధ‌ల‌ను చూపించే చిత్రం. జెంట్స్‌కే కాదు.. లేడీస్‌కి కూడా సినిమా న‌చ్చుతుంది. రెగ్యుల‌ర్ రోల్స్‌కి భిన్నంగా చేసిన చిత్ర‌మిది. మంచి సినిమా. డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌కు ఈ సినిమాతో బాగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమా స్టోరీతో సినిమా చేయాలనుకుంటే వీడెవరో కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నాడని అందరూ అనుకున్నారు. అయితే మౌర్య‌గారు న‌మ్మ‌కంతో ఒప్పుకున్నారు. త‌న‌కు థాంక్స్‌. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌’’ అన్నారు. 
 
నిర్మాత మౌర్య సిద్ధ‌వ‌రం మాట్లాడుతూ ‘‘మా టీమ్‌కి స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన శ‌ర్వానంద్‌కి, సుధీర్ వ‌ర్మ‌గారికి థాంక్స్‌. శ‌ర‌ణ్ అన్న నా ఫ‌స్ట్ డైరెక్ట‌ర్‌. నేను ఈ టీమ్‌ని సెట్ చేసుకున్నానంటే ఆయ‌నే కార‌ణం. ఆయ‌న‌తో పాటు ఫ‌ణిగారు స‌పోర్ట్ చేశారు. యంగ్ టీమ్‌తో క‌లిసి మంచి సినిమా చేశామ‌ని అనుకుంటున్నాను’’ అన్నారు. 
 
హీరో న‌రేష్ అగ‌స్త్య మాట్లాడుతూ ‘‘శర్వానంద్, సుధీర్‌గారికి, శ‌ర‌ణ‌న్న‌గారికి థాంక్స్‌. మెన్ టూ అనే టైటిల్ ఉన్న‌ప్పటికీ అమ్మాయిల‌కే ఈ మూవీ ఎక్కువ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను. మౌర్య‌, శ్రీకాంత్‌ల‌కు థాంక్స్‌. టీజ‌ర్ నచ్చుతుంద‌ని అనుకుంటున్నాను’’ అన్నారు. 
 
కౌశిక్ ఘంట‌సాల మాట్లాడుతూ ‘‘శర్వాన్న, సుధీరన్న, శరణన్నకు థాంక్స్. టీజర్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, సినిమాను అంత కంటే ఎంజాయ్ చేస్తారు. మౌర్య చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. శ్రీకాంత్‌గారు అమేజింగ్ కాన్సెప్ట్‌తో చేసిన సినిమాను త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో చూడ‌బోతున్నాం’’ అన్నారు. 
 
రైట‌ర్ రాకేందు మౌళి మాట్లాడుతూ ‘‘పాటలు, మాటలు రాసే అవకాశం ఇచ్చిన మౌర్య సిద్ధ‌వ‌రంకి థాంక్స్‌. కిరాక్ పార్టీ సమయంలో మా మ‌ధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డింది. డైరెక్ట‌ర్ శ్రీకాంత్‌తో చేసిన జ‌ర్నీ చాలా హ్యాపీగా ఉంది. ఆడ‌వాళ్ల మ‌న‌సులు నొచ్చుకోకుండా మ‌గ‌వాళ్ల క‌ష్టాల‌ను చెప్ప‌టంలో స‌క్సెస్ అయ్యాన‌ని అనుకుంటున్నాను’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్ చదలవాడ ధీర తో మధురం అంటూ రాబోతున్నాడు